ఇన్నాళ్లూ మహిళలకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలుండేవి. పురుషులైతే కండోమ్‌లు వాడడం ద్వారానో లేక వేసక్టిమీ ద్వారానో పిల్లలు పుట్టకుండా..పునరుత్పత్తికి అడ్డుకట్ట వేసేవారు. ఇప్పుడు పురుషుల కోసం కూడా గర్భ నిరోధక ఔషధం మరో రెండేళ్లలో మార్కెట్లోకి రానుంది. మాంచెస్టర్ యూనివర్సిటీ, ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ గర్భనిరోధక ఔషదాన్ని తయారు చేశారు. ఈ ఔషదాన్ని ఉపయోగించిన తొలి వ్యక్తి, ఎడిన్‌బర్గ్ పీహెచ్‌డీ స్టూడెంట్ జేమ్స్ ఓవెర్స్ ఈ ప్రయోగ వివరాలను స్కైడాట్‌కామ్‌తో పంచుకున్నారు. తన సతీమణి ఓ ప్రకటనను చూసి ఈ పరిశోధన గురించి తెలిపిందని, ఈ ప్రయోగంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
గర్భనిరోధక జెల్ ఉపయోగించిన తొలి వ్యక్తి జేమ్స్ ఓవెర్స్
అయితే ప్రస్తుతం పరీశీలనలో ఉన్న ఈ ఔషధం మరో రెండేళ్లలో వినియోగంలోకి రానుందని తెలిపారు. ‘ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉన్నాయి. జెల్ లా కనిపించే నెస్టోరోన్ (NES/T) అనే హార్మోన్ వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తిని నిలిపివేస్తుంది. దీన్ని వాడటం ప్రారంభించిన తర్వాత 6-12 వారాల్లో సెమెన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. వినియోగించడం నిలిపి వేసిన తర్వాత 6-12 వారాల్లో శుక్ర కణాలు ఎప్పటిలాగే తయారవుతాయి. వృషణాల్లోని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కణజాలం స్పెర్మాటో జెనెసిస్ అనే ప్రక్రియ ద్వారా వీర్యకణాలను తయారు చేస్తాయి. ఈ ఔషధం ప్రభావం వల్ల ఈ ట్యూబ్యూల్స్ కు ఎటువంటి హాని జరగదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ కు చెందిన 450 మంది పురుషులపై ఈ జెల్‌ను ప్రయోగించాం. ఏడాది క్రితం మొదలైన ఈ అధ్యయనంలో దుష్ఫలితాలు ఏవీ మా దృష్టికి రాలేదు.
ఈ జెల్ ను ఎలా ఉపయోగించాలంటే..
నెస్టోరోన్ జెల్‌ను భుజాలకు గాని, వీపుకు గాని పూసుకోవాలి. కలబంద గుజ్జులా ఉండే ఈ జెల్ అరగంటలో చర్మం ద్వారా శరీరంలోకి ఇంకుతుంది. పిల్స్‌తో పోలిస్తే ఇది చాలా ఉత్తమం’ అని ఓవెర్స్ పేర్కొన్నాడు. గర్భనిరోధకానికి ఇప్పటికే మార్కెట్లో చాలా మార్గాలున్నాయని, కానీ తాము ఇంకా సులభతరం చేద్దామనే ఈ ఔషదాన్ని కనుగొన్నామని పరిశోధకురాలైన డాక్టర చెర్లీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment