అపురూపం: ఒకే ఒక మాయాబజార్ | Mayabazar is India's evergreen film | Sakshi
Sakshi News home page

అపురూపం: ఒకే ఒక మాయాబజార్

Published Sun, Dec 8 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

అపురూపం: ఒకే ఒక మాయాబజార్

అపురూపం: ఒకే ఒక మాయాబజార్

 తెలుగు సినిమా పుట్టి ఎనభై సంవత్సరాలు పూర్తయ్యాయి!
 ఇన్ని సంవత్సరాలలో... అన్ని తరాల వారికి నచ్చిన చిత్రం
 అన్ని వయసులవారు మెచ్చిన చిత్రం ఏదైనా ఉందంటే, అది ‘మాయాబజార్’ ఒక్కటే!
 భారీ తారాగణంతో, భారీ సెట్స్‌తో, దాదాపు 30 లక్షల బడ్జెట్‌తో తెలుగు తమిళ భాషలలో విజయ ప్రొడక్షన్స్‌వారు అందించిన దృశ్యకావ్యం ఈ మాయా బజార్!
 అన్ని విధాలా భారీగా తీస్తున్నాము. హిట్టవుతుందా అని మథనపడ్డారట అందరూ. హిట్టయ్యింది!
 ఎంత హిట్టంటే... తెలుగు సినిమా ఇంతవరకూ ఎప్పుడూ చూడనంత!

 
 ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు...’ పాట చిత్రీకరణప్పుడు ఘటోత్కచుడు పాత్రధారి ఎస్వీ రంగారావు దగ్గర లైటింగ్ ఎక్స్‌పోజర్‌ని చెక్ చేసుకుంటున్న ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే (పైన).
 సినిమాలో శశిరేఖ పాత్రధారి సావిత్రిపై ‘నీవేనా నను తలచినది...’ పాటను చిత్రీకరిస్తున్నప్పటి స్టిల్ ఇది (కుడి). సావిత్రి అభినయిస్తుండగా దర్శకుడు కె.వి.రెడ్డి (కుర్చీలో), ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే తదితరులు పరిశీలిస్తున్న అపురూపమైన స్టిల్ ఇది!
 
 ఇక ఈ సినిమాలో ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము’ పాటను రేలంగి (లక్ష్మణ కుమారుడు) సావిత్రి వెంటపడుతూ పాడగా సావిత్రి ‘దూరం దూరం..’, ‘పెద్దలున్నారు...’ వంటి చిన్న చిన్న మాటలు పాట మధ్యలో అంటుంది. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఘంటసాల (ఎడమ చివర), కె.వి.రెడ్డి (ఎడమ నుంచి నాలుగో వ్యక్తి) తదితరులు సావిత్రితో రిహార్సల్స్ చేయిస్తున్న దృశ్యం ఇది (ఎడమ).
 
 ప్రేక్షకులు 1957లో తొలిసారి ఈ సినిమాని చూశారు.
 ఇప్పటికీ చూస్తున్నారు!
 మునుముందూ చూస్తారు!!
 అంతేముందీ మాయాబజార్‌లో!!!
 నటీనటుల అందమా... వారి అభినయమా...
 కథా... కథనమా... సెట్టింగులా... లైటింగులా...
 మాటలా... పాటలా...
 ఏం బాగుంటాయి ఈ సినిమాలో?
 అన్నీ బాగుంటాయి!
 అవును... నిజంగా... అన్నీ బాగుంటాయి!
 అందుకే... ‘మాయా బజార్’ అంత బాగుంటుంది!!!
 నిర్వహణ: సంజయ్ కిషోర్
 sanjjaykkishor@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement