అది ‘ఆ’గ్రహణం వల్ల కాదు! | Morri not Klepht Pallet | Sakshi
Sakshi News home page

అది ‘ఆ’గ్రహణం వల్ల కాదు!

Published Sun, Dec 27 2015 2:24 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

అది ‘ఆ’గ్రహణం వల్ల కాదు! - Sakshi

అది ‘ఆ’గ్రహణం వల్ల కాదు!

అవాస్తవం
గ్రహణం వేళల్లో గర్భిణులను బయటకు రానివ్వరు పెద్దవాళ్లు. పైగా ఆ సమయంలో గర్భవతులు బయట తిరిగితే సూర్య కిరణాలు సోకి పుట్టబోయే బిడ్డకు గ్రహణం మొర్రి వస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇది కేవలం అపోహ వూత్రమే. నిజానికి గ్రహణం సవుయుంలో బయుట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. ఇంగ్లిష్‌లో దీన్ని క్లెఫ్ట్ ప్యాలెట్ అని పిలుస్తారు.
 
దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి గ్రహణం మొర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయుంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయుంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయుంలో ఒక్కోసారి  బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ గ్రహణం మొర్రి ఏర్పడుతుంది.  శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మొర్రి సవుస్యను సవుర్థంగా చక్కదిద్దవచ్చు.

అయితే ఎంత చిన్నవయుసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు కూడా అంత బాగుంటాయి. కాబట్టి ఈ బిడ్డ వైకల్యాన్ని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఇక వురో విషయుం ఏమిటంటే... తాము గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. కాబోయే తల్లిదండ్రులు చేయాల్సిందల్లా ఒకటే.

వీలైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ముందు నుంచీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు తప్పక తీసుకోవాలి. కొందరిలో గర్భం వచ్చిన విషయం ముందే తెలియదు. వాళ్లు కనీసం తాము గర్భ వతులమని తెలిశాక... ఫోలిక్ యూసిడ్ ట్యాబ్లెట్లను వాడటం మంచిది. ఆకు కూరల్లోనూ ఫోలిక్ యాసిడ్ ఎక్కువే. ఇది గ్రహణం మొర్రినీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్‌నూ చాలావరకు నివారిస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement