eclipse Today
-
Surya Grahan 2022: దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం(ఫోటోలు)
-
కృష్ణానది తీరాన సూర్యగ్రహణం వీక్షిస్తున్న జనం (ఫొటోలు)
-
గ్రహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
-
ముగిసిన సూర్యగ్రహణం
దేశంలోని కొన్ని చోట్ల సూర్య గ్రహణం 4.29 గంటల సమయంలో మొదలై గరిష్ఠంగా గంటా 45 నిమిషాల పాటు కనిపించింది. సాయంత్రం 6.26 గంటలకు గ్రహణం పూర్తయింది. ఢిల్లీ, జమ్ము, అమృత్సర్, వారణాసి వంటి చోట్ల సూర్య గ్రహణం ముందుగా కనిపించింది. ఆయా ప్రాంతాలను బట్టి సూర్య గ్రహణం సమాయాల్లో తేడాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 4.58 గంటల నుంచి 5.55 గంటల వరకు సూర్య గ్రహణం కనిపించింది. బిర్లా ప్లానిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. గ్రహణం వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు సందర్శకులు. గ్రహణం మధ్యకాలం సాయంత్రం 5.29 గంటలుగా నిపుణులు తెలిపారు. గాగుల్స్ పెట్టుకుని మాత్రమే గ్రహణం వీక్షించాలని సూచించారు. 22 ఏళ్ల తర్వాత ఏర్పడిన అరుదైన గ్రహణం కావటంతో చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. -
గ్రహణం ఎఫెక్ట్
అరసవల్లి: సంపూర్ణ చంద్ర గ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ ఆలయాలు బుధవారం మూతపడనున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయాన్ని ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో వి.శ్యామలాదేవి, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు మంగళవారం తెలిపారు. ఆ తరువాత నుంచి భక్తులకు సర్వదర్శనాలుంటాయన్నారు. బుధవారం సాయంత్రం 5.17 నుంచి రాత్రి 8.42 గంటల వరకు రాహుగ్రస్త చంద్ర గ్రహణ సమయం ఉంటుందని, దీంతో ఉదయం 8 గంటలకు స్వామి వారికి నిత్యార్చన చేసి, ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న సహస్ర దీపాలంకరణ సేవను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలు కూడా.. గార మండలంలోని శ్రీకూర్మం ఆలయాన్ని బుధవారం 12 గంటల తరువాత మూసి వేయనున్నారు. తిరిగి గురువారం తెల్లవారు జామున సంప్రోక్షణం తరువాత స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయాన్ని కూడా బుధవారం ఉదయం నుంచి మూసి వేయనున్నారు. గురువారం తెల్లవారుజామున సంప్రోక్షణ పూజలు చేసిన తరువాత భక్తులను అనుమతిస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సంబంధిత అధికారులు సూచించారు -
అది ‘ఆ’గ్రహణం వల్ల కాదు!
అవాస్తవం గ్రహణం వేళల్లో గర్భిణులను బయటకు రానివ్వరు పెద్దవాళ్లు. పైగా ఆ సమయంలో గర్భవతులు బయట తిరిగితే సూర్య కిరణాలు సోకి పుట్టబోయే బిడ్డకు గ్రహణం మొర్రి వస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇది కేవలం అపోహ వూత్రమే. నిజానికి గ్రహణం సవుయుంలో బయుట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. ఇంగ్లిష్‌లో దీన్ని క్లెఫ్ట్ ప్యాలెట్ అని పిలుస్తారు. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి గ్రహణం మొర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయుంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయుంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయుంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ గ్రహణం మొర్రి ఏర్పడుతుంది. శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మొర్రి సవుస్యను సవుర్థంగా చక్కదిద్దవచ్చు. అయితే ఎంత చిన్నవయుసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు కూడా అంత బాగుంటాయి. కాబట్టి ఈ బిడ్డ వైకల్యాన్ని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఇక వురో విషయుం ఏమిటంటే... తాము గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. కాబోయే తల్లిదండ్రులు చేయాల్సిందల్లా ఒకటే. వీలైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ముందు నుంచీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు తప్పక తీసుకోవాలి. కొందరిలో గర్భం వచ్చిన విషయం ముందే తెలియదు. వాళ్లు కనీసం తాము గర్భ వతులమని తెలిశాక... ఫోలిక్ యూసిడ్ ట్యాబ్లెట్లను వాడటం మంచిది. ఆకు కూరల్లోనూ ఫోలిక్ యాసిడ్ ఎక్కువే. ఇది గ్రహణం మొర్రినీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్నూ చాలావరకు నివారిస్తుంది.