ఫ్యామిలీ ఫ్యామిలీ నోబెల్ అందుకుంది!
ఆదర్శం
నోబెల్ బహుమతి అందుకోవడం అపురూపమైన ఘనత. మరి ఆ బహుమతితోనే రికార్డులు సృష్టించడం అంటే... అది ఇంకా పెద్ద ఘనత. మేరి క్యూరీకి, ఆమె కుటుంబానికి మాత్రమే సాధ్యమైన ఘనత. రేడియోధార్మికతపై పరిశోధనలు చేసి ఫిజిక్స్ పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన మేరీక్యూరీ నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న తొలి మహిళ. అలాగే ఆమె రెండుసార్లు నోబెల్ బహుమతిని అందుకొన్న మహిళ కూడా(ఒకటి ఫిజిక్స్‌లో, రెండోది కెమిస్ట్రీలో).
కుటుంబపరంగా చూసుకొంటే క్యూరీల ఫ్యామిలీ ఐదు నోబెల్ అవార్డులు అందుకుంది. మేరీ క్యూరీ రెండు, భర్త పియరీ క్యూరీ ఒకటి (మేరీతో పాటు భౌతికశాస్త్ర విభాగంలో). ఆ తర్వాత మేరీ పెద్ద కూతురు ఇరేన్ జూలియట్ క్యూరీ, ఇరేన్ భర్త 1935లో కెమిస్ట్రీ విభాగంలోనూ, మేరీ చిన్న కూతురు ఈవ్ క్యూరీ యూనిసెఫ్ డెరైక్టర్‌గా 1965లోనూ నోబెల్ అందుకున్నారు.