దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్‌ | South Korean Author Han Kang Got Nobel Prize In Literature | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్‌

Published Thu, Oct 10 2024 5:17 PM | Last Updated on Thu, Oct 10 2024 5:19 PM

South Korean Author Han Kang Got Nobel Prize In Literature

దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు సాహిత్యంలో 2024 ఏడాదిగాను నోబెల్‌ పురస్కారం దక్కింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను స్వీడిష్ నోబెల్‌ కమిటి గురువారం నోబెల్‌ పురష్కారాన్ని ప్రకటించింది.   ఉత్తర కొరియా నుంచి  సాహిత్యంలో నోబెల్‌ పురస్కారం దక్కించుకున్న తొలి మహిళ హాన్‌ కాంగ్‌.

 

హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జన్మించారు. ఆమెకు సాహిత్య నేపథ్యం ఉంది. ఆమె తండ్రి ప్రసిద్ధ నవలా రచయిత. హాన్‌ కాంగ్‌ 1993లో మున్హాక్-గ్వా-సాహో (సాహిత్యం, సమాజం) శీతాకాల సంచికలో ‘వింటర్ ఇన్ సియోల్’పేరుతో ఐదు కవితలను ప్రచురించారు. దీని ద్వారా కవయిత్రిగా సాహిత్య రంగ ప్రవేశం చేశారు.  అనంతరం నవలా రచయిత్రిగా తన కెరీర్‌ను ప్రారంభించారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement