వారఫలాలు(నవంబర్‌ 3 నుంచి 9) | Weekly Horoscope From 3rd November To 9th November In Funday | Sakshi
Sakshi News home page

వారఫలాలు(నవంబర్‌ 3 నుంచి 9)

Published Sun, Nov 3 2019 8:00 AM | Last Updated on Sun, Nov 3 2019 8:00 AM

Weekly Horoscope From 3rd November To 9th November In Funday - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. నూతన విద్యావకాశాలు దక్కే ఛాన్స్‌. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు మరింత గుర్తింపు, వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలందుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వేడుకలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. మీపై కుటుంబసభ్యుల నుంచి సానుకూల వైఖరి కనిపిస్తుంది. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి, కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు అంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో  ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే, విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. 

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణదాతలు సైతం ఒత్తిడులు పెంచుతారు. కుటుంబసభ్యులతో మాటపడాల్సిన సమయం. ప్రముఖులతో పరిచయాలు కొంత ఊరటనిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలలో అవరోధాలు.  ఉద్యోగాలలో మరింత పనిఒత్తిడులు, ఆకస్మిక మార్పులు. స్వల్ప ధనలబ్ధి. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త వ్యూహాలు, ఆలోచనలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. మీ అభిప్రాయాలను మిత్రులు మన్నిస్తారు. కొన్ని విషయాలలో మీ నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఒక కోర్టు వ్యవహారంలో సానుకూలత కనిపిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక   విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. పసుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. దీక్ష, పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
విద్యార్థుల శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీపై ఇంతకాలం విమర్శలు చేసిన వారు ప్రశంసలు కురిపించడం విశేషం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితిలో ఆటుపోట్లు తొలగుతాయి. వాహనయోగం. సోదరులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. కొత్త భాగస్వాములతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి, పదోన్నతులు. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement