మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ సమర్థత నిరూపించుకుంటారు. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. రుణయత్నాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
మిథునం : (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం : (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. అనుకోని సంఘటనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రులు, బంధువులతో విభేదాలు. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. వారం మధ్యలో ఆస్తివివాదాలు. అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.
కన్య : (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాన్వేణ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించిన ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా శ్రమ తప్పదు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
తుల : (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం : (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు తాము పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఎరుపు, గులాబీరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి.
మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహన, గృహయోగాలు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో మరింత ప్రగతి ఉంటుంది. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం : (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
మీనం : (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు సమయానికి చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, కొత్త పదవులు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment