మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరపతి మరింతగా పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తొలగి, కొంత ఊరట చెందుతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఎదురవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాల యత్నాలలో పురోగతి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ ఊహలు నిజం కాగలవు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనితీరుతో, మాటనేర్పుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఏపనినైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. తీర్థయాత్రలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల బాధ్యతలకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. మీ అభిప్రాయాలు బంధువులకు నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనూహ్యంగా ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత స్థానాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం క్రమేపీ తొలగుతాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు. మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. అందర్నీ ఆశ్చర్యపరచే నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పాత బాకీలు వసూలవుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. లేత నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఎటువంటి సమస్యనైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. బంధువులతో తగాదాలు. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా)
రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలపై బంధువులతో సంప్రదిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలను విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనుల్లో విజయం సా«ధిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు, లాభాలు తథ్యం. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. రాజకీయ వర్గాలకు సాంఘిక గౌరవం. వారం మధ్యలో ఖర్చులు అధికం. కుటుంబంలో ఒత్తిడులు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక విషయాలలో చికాకులు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సోదరీ సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక హామీలపై తొందరవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల మిత్రులు కొంత సహాయపడతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment