అంతా బాగుంది అని మన దేశ ప్రధాని అమెరికా వెళ్లి మరీ ఆనందంగా నినదించారు. అమె రికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా వేదిక మీద ఉన్న పెద్దలు, ఎదు రుగా కూర్చున్న మన ప్రవాస భారతీయులు, నమో, నమో అని నిత్యం జపించే, అక్కడి శ్రోతలూ, ఎక్కడెక్కడినుంచో ఆ సభ ఏర్పాట్ల కోసం, తదితర ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. సభాస్థలికి వెలు పల కొందరు చేరి, ఇక్కడి బీజేపీ పాలనకు అసమ్మతి తెలు పుతూ నినదిస్తున్నారు. ఆ సభాస్థలిలో సైతం కొందరు ఏమిటీ ఈయన అంతా బాగుంది అనుకుంటున్నారు. ఎవర్ని గురించి? ఈ సభకు వచ్చిన వాళ్లను ఉద్దేశించి ట్రంప్‌ని దృష్టిలో ఉంచుకునా? అమెరికాను గురించా? లేదా తాను ప్రధానిగా ఉన్న భారత దేశాన్ని గురించా? అని అయోమయంగా చూశారట. ఎంత బీజేపీ వాడైనా, అదీ ఆర్‌ఎస్‌ఎస్ భూమిక ఉన్నవాడైనా, అంతా బాగుంది అని ఎలా అనగలరు అనుకున్నారు.
రెండేళ్ల క్రితం మోదీ తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. నేటికీ కోలుకోలేనంతగా పేద మధ్యతరగతి ప్రజా నీకాన్ని ఏదో మేరకు వేధిస్తోంది కదా! ఆనాడు మూతప డిన ఎక్కువమందికి ఉపాధి చూపే చిన్న మ«ధ్యస్థాయి పరి శ్రమలు, చిన్ని చిన్ని దుకాణదారులు, చేతివృత్తులవారు తమ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై జీవన ప్రమాణాలు దిగ జారి కునారిల్లుతున్నారు కదా. అంతెందుకు.. తమ వద్ద అప్పటికే ఉన్న, అయిదో పదో పెద్దనోట్లను నిర్ణీత గడువు లోగా మార్చుకుందామని ఆంజనేయుడి తోకవంటి క్యూలై న్లలో నిలబడి, సాధారణ జనం వందమందికి పైగా ఆ లైన్లలో నిలబడలేక అసువులు బాశారు కదా! కనీసం ఆ చర్యవల్ల బాధితులైన వారికి క్షమాపణ చెప్పని మోదీ, ఆయన భజన బృందం అది ఎంతో సాహసవంతమైన చర్య, దానివల్ల పన్నుకట్టే వారి సంఖ్య పెరిగిందని జబ్బలు చరుచుకుంటున్నారు. మనలో మనమాట. ఈ సంవత్సరం పన్నుల రాబడి కేంద్రానికి 1 లక్ష 40 కోట్ల మేర తగ్గిందట కదా.. అయినా సరే మోదీగారికి ‘అంతా బాగుంది’. ఉగ్ర వాదులకు, తీవ్రవాదులకు పెద్ద నోట్ల రద్దు వల్ల ఆ కరెన్సీ దొరక్క వారి అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుందని మోదీ ఆనాడు చెప్పారు కదా! కానీ సీమాంతర ఉగ్రవాదం తీవ్ర వాదం ఆ పెద్దనోట్ల రద్దు తర్వాత పెరగడమే కాదు.. వారి దాడులలో మరణిస్తున్న మన భారతీయుల సంఖ్య అంత కంతకూ పెరుగుతూనే ఉందని వారి సర్కారు లెక్కలే చెబు తున్నాయి. అయినా సరే ‘అంతా బాగుంది’.
2004 ఎన్నికలకు ముందు కూడా నాటి వాజ్‌పేయి గారి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా షైనింగ్ ఇండియా (భారత్ వెలిగిపోతోంది) అని ములగచెట్టు ఎక్కించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా తనపై అలి పిరిలో నక్సలైట్ల దాడికి గురై బతికి బయటపడిన నేప థ్యంలో.. తన చరిష్మాకు తోడు దాడివలన తనపై ప్రజల్లో ఉన్న సానుభూతి రెండూ కలిసి తన వెన్నుపోటు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి తానే సీఎం అవుతానన్న స్వార్థ బుద్ధితో ముందుగానే జమిలి ఎన్నికలకు వెళ్లాలని వాజ్ పేయిపై ఒత్తిడి తెచ్చారు. తీరా ఎన్నికలు జరిగాయి. ‘నీనుంచి నే చెడితినే’ అన్నట్లు చంద్రబాబుతోపాటు పాపం వాజ్‌పేయి కూడా పదవీ భ్రష్టత్వం పొందారు.
ఇక చంద్రబాబు పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా– ఏపీ నూతన రాజధాని అభివృద్ధి అంతా దగ్గరుండి చూసుకోవాలి కదా అనే వంకతో ఓటుకు కోట్లు కేసులో కన్నంలో దొంగలా దొరికిపోయి, తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి, కృష్ణా కరకట్టపై ‘లింగమనేని’ వారి రియల్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. అద్దెకు ఉంటున్నారో, అది భూసమీకరణలో వచ్చిన ప్రభుత్వ భూమో ఆయన స్పష్టం చేయలేదు. అదనీ, ఇదనీ రెంటికీ చెడింది ఆయనే. మంగళ గిరి ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ నాయకుడు రామకృష్ణారెడ్డికి ఆ అమరావతి ప్రాంతమంతా కొట్టిన పిండి. కనుకనే మొన్న కృష్ణా నదికి 2009 తర్వాత దాదాపు అంత వరద వస్తే సహ జంగా రాజధాని కరకట్ట ప్రాంతా లలో ప్రజలకు అండగా నిల బడ్డారు. అప్పుడే చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా వరద తాకిడికి గురయ్యే ప్రమాదం ఏర్పడింది. బాధ్యతగల శాసనసభ్యునిగా, ప్రతిపక్షనేత ఇంటికి ముప్పు రాకుండా చూడాలని మరింత శ్రద్ధగా పర్యవేక్షించారు. లేకుంటే ‘నా కొంప మునుగుతున్నా పట్టించుకోలేదు’ అంటూ చంద్ర బాబు, గోబెల్స్ ప్రచారం చేస్తారు గదా! ఎంతకయినా దిగ జారగలరు.
అయ్యా బీజేపీ వారూ.. మీ కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్‌సింగ్ గతంలో ఒకసారి, బాబు ఎక్కడికి వెళ్లారు? ఆయనదీ మాదీ విడదీయరాని బంధం అని అన్నారు. ఇంతవరకు బాబుతో బీజేపీ, కమ్యూనిసులు, టీఆర్‌ఎస్ చివరకు కాంగ్రెస్...ఇలా అందరూ ఏదో సందర్భంలో కలిసి ఊరేగినవారే. నిజం ఏమిటంటే, బాబుగారితో చేయి కలిపితే చాలు ఆ మిత్ర పార్టీలన్నీ మటాషే మరి!
ఇటీవల బాబుగారు ‘మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని’ ఆశపడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నురంజక, పారదర్శక పాలనపై అసందర్భ, కువిమర్శలు చేస్తున్నారు. ఇటీవల మరణించిన కోడెల శివప్రసాద్‌ను తన అప్రజాస్వామిక అవినీతి పాలనకు వాడుకున్నంత మేరకు వాడుకుని తీరా ఆయనపై, ఆయన కుమారుడు, కుమార్తెలపై తెలుగు తమ్ముళ్లతో సహా దాదాపు 20 కేసులు పెడితే, ‘కోడెల వలన తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిం దని’ తన పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య చేతనే బహిరంగంగా విమర్శలు చేయించారు బాబు. కోడెలను పార్టీ నుంచి బహిష్కరించాలని లీకులు కూడా ఇచ్చి, తన చర్మం రక్షించుకునేందుకు కోడెల శివప్రసాద్‌ను అవ మానం చేయదల్చిన బాబు తీరా కోడెల మృతి అనంతరం ‘చచ్చినవాడి కళ్లు బారెడు’ అన్నట్లు కోడెల మృతిపట్ల ఎన లేని సానుభూతి కురిపిస్తున్నారు.
అప్పుడప్పుడూ బీజేపీ నాయకులలో కొందరు సైతం నేటి వైఎస్సార్‌సీపీ పాలనపై పాత స్నేహం కారణంగానూ, తనకేమైనా అవకాశవాద రాజకీయ ప్రయోజనాలేమన్నా ఉన్నాయో, లేదా సామాజిక ఆర్థిక సంబంధాలున్నాయేమో గానీ, చంద్రబాబు ఆరోపణలను వల్లెవేస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిని తమ పార్టీలో చేర్చుకుని, వారితో పనికి మాలిన విమర్శలు జగన్ పాలనపై, జగన్‌పై చేయిస్తున్నారు. బాబుకు తన వెన్నుపోటు పార్టీ ఉన్నా, లేకున్నా పెద్ద బాధ లేదు. కానీ తన వ్యక్తిగత రాజకీయ రక్షణ కోసం బీజేపీతో కలిసినా కలుస్తారాయన!
డాక్టర్ ఏపీ విఠల్
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్ : 98480 69720
చంద్రబాబుతో చెలిమి అనర్థదాయకం
Published Fri, Sep 27 2019 1:42 AM | Last Updated on Fri, Sep 27 2019 1:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment