
స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల వర్గీకరణపై అవకతవక లను సరిదిద్ది, అన్ని వెనుకబడిన వర్గాలకు సరైన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం కోసం దామాషా ప్రకారం ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేయాలి.
స్థానిక సంస్థల్లో వెనుకబ డిన తరగతులకు రిజర్వే షన్లు కల్పించే విషయంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు నిర్మాణాత్మక హోదాను కల్పించి ఎస్సీ, ఎస్టీల తోపాటు వెనుకబడిన తరగ తుల వారికి రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఈ ముఖ్యమైన, క్లిష్టమైన వెనుకబడిన తరగతుల వర్గీకరణను సిఫారసు చేసిన అనంతరామన్ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వాలు విస్మ రించాయి. పైగా అనేక హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం సమర్థించిన శాస్త్రీయ వర్గీకరణ ప్రతిపాదన లను అవహేళన చేయడమే కాకుండా అందరు వెను కబడిన తరగతుల వారిని ఒకే గాటన కట్టి, స్థానిక సంస్థలలో 1/3 వంతు రిజర్వేషన్లను కేటాయి స్తూ జీవో విడుదల చేశాయి. దీని ఫలితంగా తెలంగాణలో గత 30 ఏళ్లలో స్థానిక సంస్థల్లో మున్నూరు కాపు, యాదవ, గౌడ, ముదిరాజ్, పెరిక, పద్మశాలి వంటి కొన్ని కులాల వారు మాత్రమే ఈ 1/3వ వంతు సీట్లలో 86 శాతాన్ని రాబట్టుకున్నారు. ఏపీలో కూడా కొన్ని కులాలవారికి మాత్రమే ఇలా లబ్ధి చేకూరింది. దీంతో ఇది స్థానిక సంస్థల్లో అంటే గ్రామాలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్‌లు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వెనుక బడిన తరగతులలో సాంఘిక, ఆర్థిక అసమానతలను పెంచి స్థానిక సంస్థల పరిపాలనలో అసమతుల్యతను ఏర్పరిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పర్చిన సమగ్ర సర్వే ప్రకారం తెలంగాణలో వెనుకబడిన తరగతుల జనా భాను 52%గా అంచనా వేశారు. అందులో వెనుక బడిన తరగతుల రిజర్వేషన్లలో సింహభాగాన్ని రాబ ట్టుకొన్న పైన పేర్కొన్న 6–8 కులాల జనాభా 18–20%గా అంచనా వేయడమైంది. పైన పేర్కొన్న వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చూస్తే, 32%లో ఉన్న మిగిలిన 90+ వెనుకబడిన కులాల జనాభా ప్రాతినిధ్యం స్థానిక సంస్థల పదవులలో చాలా తక్కు వగా ఉందని గమనించవచ్చు.
ఈ మధ్యకాలంలో బలహీనవర్గాల సాధికార తను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మార్కెట్‌యార్డ్ కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అమలుపరిచింది. కానీ, ఈ పథకంలో కూడా అనంతరామన్ కమిషన్ వెనుకబడిన తరగతు లపై చేసిన సిఫారసులపై అవగాహనా రాహిత్యం వల్ల, వెనుకబడిన తరగతుల వర్గీకరణ విస్మరణకు గురైంది. స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో వర్గీకరణ పాటించక పోవటం వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా వెనుకబడిన కులాల వారు కొందరు ఈ విషయాన్ని ఠీ.p. పిల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పై రెండు సందర్భాలలో కూడా హైకోర్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతుల వర్గీకరణ విధా నాన్ని అమలుపరచమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013 సంవ త్సరం ఇచ్చిన తీర్పును అమలుపరుస్తూ స్థానిక సంస్థ లలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణను అమలుపరచాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతులు ఎ గ్రూప్ పరిరక్షణ సమితి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అభ్యర్థిస్తోంది. వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం కల్పించే వివిధ అవకాశాలలో వెనుకబడిన తరగతుల సమాన ప్రాతినిధ్యం కోసం వారిని వర్గీకరించే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా యూఎస్‌వీ బలరాం, ఎం.ఎస్. ఇంద్ర సాహ్నే కేసులో సమర్థించింది. వెను కబడిన తరగతి ఏ–గ్రూపు వారు సంచార జాతులు, మిగిలిన కులాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. కాబట్టి బీ, సీ, ఏ గ్రూపులో ఇతర కులాల వారిని ఎవ్వరినీ కూడా కలుపకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. వెనుకబడిన తరగతులలో అన్ని వర్గాలకు నిమ్న వర్గాలకు నిమ్న వర్గాల అభివృద్ధి ఫలాలను సమా నంగా పంచేందుకు ఏబీసీడీ వర్గీకరణను చేశారు. దానికి అనుగుణంగా కమిషన్ వారి వారి జనాభా నిష్పత్తిని అనుసరించి మొత్తం వెనుకబడిన తరగతు లకు కల్పించిన రిజర్వేషన్లను ఆ నాలుగు వర్గాలకు సమానంగా పంచాలని సూచన చేసింది. కానీ, ఆ సూచనను అర్థం చేసుకోవటంలో అవగాహనా రాహిత్యంవల్ల వర్గీకరణ అమలు అత్యంత లోపభూయిష్టంగా తయారైంది.
గత 30 ఏళ్లుగా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి, వెనుకబడిన వర్గాల అసలు జాబితాలోని అన్ని కులాలకు సమా నమైన అవకాశాలను కల్పిస్తూ ఇచ్చిన 33.33 శాతంలో అన్ని వర్గాలకు సరైన నిష్పత్తి ప్రకారం రాష్ట్ర రిజర్వేషన్లను కల్పించాలి. రాబోయే 2018 స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలో వెనుకబడిన తరగతుల ఏబీసీడీ వర్గీకరణను ఖచ్చితంగా అమలుపర్చేందుకు సరైన అధ్యయనం జరిపి జీవోను విడుదల చేయాలి. ఆవిధంగా ప్రస్తుతమున్న స్థానిక సంస్థల్లో వెనుకబ డిన తరగతుల రిజర్వేషన్ వి«ధానంలో నిర్లక్ష్యానికి గురైన, అణగారిన, వెనుకబడిన తరగతుల ప్రజలకు –బి.సి.ఎ–ప్రభుత్వం తగు న్యాయం చేకూర్చాలి.
వ్యాసకర్త రిటైర్డ్ ఎస్పీ ‘ 99665 18033
దుగ్యాల అశోక్