సాధారణంగానే కేంద్ర సమాచార కమిషన్ దృశ్య శ్రవణ ప్రసారం ద్వారా సుదూర ప్రాంతాల అప్పీలు విచారణ సాగి స్తుంది. గుంటూరులో ఉన్న దరఖాస్తుదారుడు గుంటు పల్లి ఆంజనేయులు కేసును కూడా ఇలా విచారించింది. ఈయన వృద్ధ రంగస్థల కళాకారుడు. ఆ విషయం నిరూపించడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యా లయంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గది నుంచి వీడియోలో ఒక పద్యం పాడి ఏకపాత్రా భినయంలో కొంత భాగాన్ని అభినయించేశారు. తెలుగు మాత్రమే వచ్చిన ఈ కళాకారుడి కోసం సీఐసీ ఈ కేసులో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో తీర్పు ఇచ్చారు. ఆంజనేయులు రంగస్థల కళాకారులకు ఇచ్చే పింఛను కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కాని జవాబు లేదు. తన దరఖాస్తుపై చర్య తీసుకున్నదీ, లేనిదీ ఎంతకీ చెప్పకపోతే మరో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై కూడా అధికారులు స్పందించలేదు. 2016 జూలై 9న ఆర్టీఐ చట్టం కింద తన ఫిర్యాదుపై ఏం చేసిందీ తెలపాలని అడిగారు. దానికీ జవాబు లేదు. ఆయనకు 80 ఏళ్లు. పౌరాణిక నాటకాల్లో ఉత్తమ కళాకారుడిగా పేరు పొందారు. ఏకపాత్రాభి నయాల్లో ఎలుగెత్తి పద్యాలు పాడటంలో అనుభవ మున్న నటుడు. కావాలంటే ఓ పద్యం పాడేందుకు అనుమతించాలని ఆయన ప్రతినిధి కోరారు.
కర్ణుడి ఏకపాత్రాభినయం నుంచి ఒక పద్యాన్ని ఆయన రాగయుక్తంగా, వయసు ప్రభావం ధ్వనిపైన పడ కుండా పాడి మెప్పించారు. నియమాల ప్రకారం దరఖాస్తును పరిశీలించి పింఛను గురించి తేల్చి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ సాంస్కృతిక శాఖది. ముందుగా దరఖాస్తుదారుడికి ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సీపీఐఓ ఐఏ కమాల్ ప్రతి అంశంపై పూర్తి సమాచారం 30 రోజుల్లో ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. ఈ దరఖాస్తుపై ఏ చర్యా తీసుకోకుండా నిర్ల క్ష్యం ప్రదర్శించినందుకు ఆర్టీఐ చట్టం సెక్షన్ 20 కింద జరిమానా ఎందుకు విధించకూడదో, ఆ కళా కారుడికి జవాబివ్వక వేధించినందుకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వసంస్థను ఎందుకు ఆదేశించకూ డదో వివరించాలని ఐఏ కమాల్‌ను కమిషన్ ఆదే శించింది. ఇలా వ్యవహరించిన అధికారులెవరో విచారించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కార ణాలు తెలపాలనే ఉత్తర్వుకు మోహిత్ కుమార్ శేఖర్ జవాబిస్తూ, పింఛనుదారుకు జీవన ధ్రువపత్రం ఇవ్వాలని తెలుసనీ, తమ అధికారులు కూడా సకా లంలో ఆ విషయం ఆయనకు తెలిపారని, దరఖాస్తు దారుడికి సమాచారం ఇవ్వడంలో జాప్యం జరగనం దున తమపై జరిమానా విధించరాదని వివరిం చారు.
పింఛను చెల్లింపునకు ఆధార్ కార్డుతో అను సంధానంచేసే పని జరుగుతోందని మోహిత్‌కుమార్ శేఖర్ తెలిపారు. ఏటా సంబంధిత బ్యాంకు శాఖలో జీవన ప్రమాణ పత్రం ఇస్తే పింఛను నెలనెలా చెల్లించడం సాధ్యమవుతుందని కూడా తెలిపారు. కేంద్రప్రభుత్వ అండర్ సెక్రటరీ ఐఏ కమాల్ దరఖాస్తుదారుడికి ఉత్తరం రాస్తూ జీవన్ ప్రమాణ్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్, పెన్షన్ ఆర్డర్ వివరాలు ఇస్తూ డిజిటల్ జీవన ప్రమాణ పత్రం డీఎల్సీ ఇవ్వాలని కోరారు. దరఖాస్తుదారుడు 2018 ఆగస్టు 5న కమిషన్‌కు రాసిన ఉత్తరంలో జీవన ప్రమాణ పత్రం ఇవ్వాలని తనకు లేఖ అందిందనీ, తాను వెంటనే డీఎల్సీ ఇచ్చాననీ, అయినా ఇంకా పింఛను అందలేదని వివరించారు. ఇందులో రెండు సమస్యలున్నాయని కమిషన్ గమనించింది. ఒకటి పింఛనుదారుడికి పింఛను నిలిపివేయడానికి నిర్ధా రించిన ఆఖరితేదీకి చాలా ముందుగానే డీఎల్సీ ఇవ్వాలని తెలపడం.
రెండోది పింఛను చెల్లింపును ఆధార్ కార్డుకు అనుసంధానించడం. డిజిటల్ పద్ధ తిలో జీవన ప్రమాణ పత్రం ఇచ్చే సౌకర్యం కల్పిం చడం మంచి దేగాని పింఛను చెల్లింపు నిలిపివేసే ముందు ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా పింఛ నుదారుడికి డీఎల్సీ గురించి తెలపాలి. పింఛను దారుల వయసు, కంప్యూటర్ విజ్ఞానం లేకపోవడం దృష్టిలో ఉంచుకుని, పింఛను ఆపాలనే కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు, ఫోన్‌లో పింఛను దారుడికి డీఎల్సీ గురించి హెచ్చరించడం లేదా వీలైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని కమి షన్ నిర్దేశిస్తోంది. డిజిటల్ జీవన ప్రమాణ పత్రం ఇచ్చినా ఈ కేసులో పింఛను ఇవ్వలేదు. ఆయనకు పింఛను చెల్లించినట్టు తెలుపుతూ సీఐసీ ఆదేశాన్ని అమ లుచేసిన విషయాన్ని వివరిస్తూ ఓ నివేదికను 15 రోజుల్లో పంపాలని ఆదేశించారు. (గుంటుపల్లి ఆంజనేయులు వర్సెస్ పీఐఓ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నాగ్‌పూర్ DID/MCULT/A/ 2017/134438 కేసులో 2018 ఆగస్టు 28 న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment