గుంటూరు : గుంటూరు జిల్లాలో పత్తిపాడు మండలం గొట్టిపాడులో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గత రాత్రి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఈ వివాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారి తీయడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఓ వైపు ఇరువర్గాల దాడులు, మరోవైపు పోలీసులు భారీగా మోహరించడంతో ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment