tension prevailed
-
గొట్టిపాడులో తీవ్ర ఉద్రిక్తత
గుంటూరు : గుంటూరు జిల్లాలో పత్తిపాడు మండలం గొట్టిపాడులో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గత రాత్రి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఈ వివాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారి తీయడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఓ వైపు ఇరువర్గాల దాడులు, మరోవైపు పోలీసులు భారీగా మోహరించడంతో ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అట్టుడుకుతున్న గోదావరి పల్లెలు
పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఆక్వా ఫుడ్‌పార్కు పెడితే దాన్నుంచి వెల్లువెత్తే కాలుష్యం కారణంగా తమ జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుందని గగ్గోలు పెడుతున్న తుందుర్రు పరిసర గ్రామాల వాసులను పోలీసులు ఈడ్చిపారేశారు. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలను మహిళా దినోత్సవం అని కూడా చూసుకోకుండా లాఠీలతో కుమ్మేశారు. గర్భిణులను కూడా ఎత్తుకెళ్లి జీపుల్లో వేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించరా? ప్రజల మనోభావాలను గుర్తించకుండా.. తీరప్రాంత ప్రజలను దారుణంగా నిర్బంధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. నిర్బంధాల ద్వారా ప్రజావ్యతిరేకతను ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ఈ ఫ్యాక్టరీ కడితే నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని, మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చి తుందుర్రు పరిసర ప్రాంత వాసులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీలకు తాము వ్యతిరేకం కాదని, సముద్రతీర ప్రాంతానికి ఇదే నియోజకవర్గంలో కట్టాలని తామంతా కూడా కోరామని.. దాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పామని అన్నారు. కానీ ప్రభుత్వం మొండివైఖరితో ఆరు నెలల నుంచి ఈ గ్రామాల్లో పోలీసులను మోహరిస్తున్నారని, 144 సెక్షన్ పెట్టి ప్రజలను నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో ఎవరికీ నష్టంలేని చోట తీరప్రాంతంలో కడితే, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడివారికే వస్తాయని తెలిపారు. రాష్ట్రమంతా రౌడీరాజ్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రమంతటినీ రౌడీ రాజ్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. ఇక్కడ దాదాపు 2వేల మంది పోలీసులను పెట్టారని, తమ సొంత ఊళ్లలో తిరగాలన్నా కూడా ఆధార్ కార్డులు పట్టుకుని తిరగాల్సి వస్తోందని అన్నారు. అసలు తొలుత పబ్లిక్ హియరింగ్ జరిపించి, ప్రజల అనుమతితోనే ఫ్యాక్టరీ కడతామని అందరూ చెప్పారని, కానీ అసలు పబ్లిక్ హియరింగ్ అన్నదే చేయలేదని తెలిపారు. పోలీసులు మఫ్టీలో ఉండి ప్రజల్లో కలిసిపోయి దారుణాలు చేస్తున్నారని, మహిళలను కూడా అరెస్టు చేసి ఈడ్చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి వంతపాడుతోందని మండిపడ్డారు. పోలీసులను అడుగుదామని అనుకుంటే తమను పొద్దుట నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయనీయకుండా హౌస్ అరెస్టు చేశారన్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏం చెప్పాలని ఆయన అన్నారు. -
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెళ్లిన పోలీసులను అక్కడివాళ్లు అడ్డుకోవడంతో కువత్తూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాబలిపురం సమీపంలోని ద్వీపంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తీసుకు రావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోపల ఉన్నవారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, శశికళ వర్గీయులతో పాటు కువత్తూర్కు చెందిన స్థానికులు కూడా పోలీసుల చర్యలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడకు వెళ్లిన మీడియా వర్గాల మీద కూడా లోపల ఉన్నవారు రాళ్లతో దాడి చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. డీఆర్వో కూడా అక్కడకు తమ సిబ్బందితో చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి అధికారులను గ్రామస్తులు బయటకు పంపేశారు. మరోవైపు లోపల ఉన్న ఎమ్మెల్యేలను మరో మార్గం గుండా బయటకు తీసుకొచ్చి, వారిని బెంగళూరు లేదా హైదరాబద్ తరలించేందుకు శశికళ వర్గం వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు బయటకు వస్తే పన్నీర్ సెల్వం టీమ్‌లో చేరుతారన్నది శశి వర్గం ఆందోళనగా కనిపిస్తోంది. ఇదంతా రాజ్యాంగ సంక్షోభమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సంబంధిత వార్తలు చదవండి గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
యాడికిలో రైతు భరోసా యాత్ర ప్రారంభం.. ఉద్రిక్తత
అనంతపురం జిల్లా యాడికి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర మూడోరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ఈ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన ఎంపీపీ వేలూరు రంగయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు. బస్టాండ్ సెంటర్లో రెండుపార్టీల శ్రేణులు ఎదురుపడ్డాయి. దీంతో ఘర్షణలకు తావులేకుండా చూసేందుకు పోలీసులు టీడీపీ శ్రేణులను వెనక్కి పంపారు. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు బస్టాండ్ సెంటర్లో బైఠాయించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రోడ్డుషో ఆలస్యం అయ్యింది. టీడీపీ శ్రేణులను పూర్తిగా పంపించిన తర్వాతే రోడ్డుషోకు లైన్ క్లియర్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేశారు. -
సిక్కుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
గురుద్వారా స్థలంపై ఆధిపత్యం కోసం రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ అమృతసర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాటు తుపాకులతో కాల్పులు జరుపుకోవడంతో ఓ బాలుడు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమృతసర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారా స్థలం మీద ఆధిపత్యం కోసం చాలా కాలంగా రెండు సిక్కు గ్రూపుల మధ్య వివాదం నడుస్తోంది. శుక్రవారం నాడు సిక్కులు సంప్రదాయబద్ధంగా జరుపుకొనే ఆయుధాల ప్రదర్శన సమయంలో ఘర్షణ మొదలైంది. తొలుత సంప్రదాయం ప్రకారమే రెండు వర్గాలకు చెందిన పలువురు సిక్కులు ప్రదర్శన ప్రారంభించారు. అంతలోనే గొడవ మొదలైంది. దాంతో రెండు వర్గాలవారు ఒకరిపై ఒకరు నాటు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. దీంతో ఒక బాలుడు సహా ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో రెండు సిక్కు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతానికి ఉద్రిక్తత సడలింది. -
అరెస్టులతో బద్వేల్లో ఉద్రిక్తత
రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయడంతో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడి ఆందోళనలో పాల్గొంటున్న ఎమ్మెల్యే జయరాములు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తుండగా వారికి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా మద్దతు తెలిపారు. రైతులను అడ్డుకున్న పోలీసులు.. ముస్తఫా సహా పలువురిని అరెస్టు చేశారు. -
తాడిపత్రిలో సమైక్య ఉద్యమం ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ పాటిస్తుండగా, కాంగ్రెస్ నాయకుడు జె.సి.ప్రభాకరరెడ్డి వారిని అడ్డుకున్నారు. షాపులు తీసి ఉంచాల్సిందేనని ఆయన పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రోడ్లను నిర్భందించి బంద్ పాటిస్తున్నారు.