అరెస్టులతో బద్వేల్లో ఉద్రిక్తత | mla arrested, tension prevailed in badwel | Sakshi
Sakshi News home page

అరెస్టులతో బద్వేల్లో ఉద్రిక్తత

Published Sat, Jul 26 2014 12:42 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

mla arrested, tension prevailed in badwel

రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయడంతో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడి ఆందోళనలో పాల్గొంటున్న ఎమ్మెల్యే జయరాములు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తుండగా వారికి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా మద్దతు తెలిపారు. రైతులను అడ్డుకున్న పోలీసులు.. ముస్తఫా సహా పలువురిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement