mla arrested
-
లాక్డౌన్ ఉల్లంఘన.. ఎమ్మెల్యే అరెస్ట్
లక్నో : సరైన కారణం లేకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం చేసినందుకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నవ్తన్వా ఎమ్మెల్యే అమన్మణి త్రిపాఠి ఆరుగురు అనుచరులతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లారు. సరైన కారణం లేకుండా ప్రయాణించడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించిన పోలీసులపై విరుచుకుపడుతూ దుర్భాషలాడారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిన కారణంగా ఐపీసీ సెక్షన్ 188, 269, 270 కింద కేసు నమోదు చేసి ఎమ్మెల్యేతో సహా అతని అనుచరులను అరెస్ట్ చేసి, రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ సంజీవ్ త్యాగి తెలిపారు. అంతేకాకుండా అందరినీ పరీక్షించి ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ చేసినట్లు చెప్పారు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే సహా, అనుచరులు కేదర్నాథ్, బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్లెందుకు బయలుదేరగా, ఘజియాబాద్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకుముందు భార్యపై హత్యా ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా త్రిపాఠిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ ) -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు : ఎమ్మెల్యే అరెస్టు..!
-
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు : ఎమ్మెల్యే అరెస్టు..!
సాక్షి, చెన్నై : ప్రముఖ హాస్య నటుడు, అన్నా డీఎంకే ఎమ్మెల్యే, శశికళ వర్గం నేత కరుణాస్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, పలు వార్త సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై సెప్టెంబర్ 16న జరిగిన ఒక ధర్నాలో కరుణాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్షమాపణలు సైతం చెప్పారు. అనంతరం కొన్ని రోజులుగా కరుణాస్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో.. పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేయక తప్పలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న కురుణాస్ను అరెస్ట చేశామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించి స్పీకర్‌తో చర్చిస్తామని వెల్లడించారు. కాగా, అరెస్టుపై న్యాయపరంగా వెళ్తానని కరుణాస్ తెలిపారు. ఇదిలాఉండగా కరుణాస్ 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే టికెట్‌పై తిరవదనై నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
అరెస్టులతో బద్వేల్లో ఉద్రిక్తత
రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయడంతో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడి ఆందోళనలో పాల్గొంటున్న ఎమ్మెల్యే జయరాములు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తుండగా వారికి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా మద్దతు తెలిపారు. రైతులను అడ్డుకున్న పోలీసులు.. ముస్తఫా సహా పలువురిని అరెస్టు చేశారు.