
ఎమ్మెల్యే కరుణాస్ (పాత చిత్రం)
సాక్షి, చెన్నై : ప్రముఖ హాస్య నటుడు, అన్నా డీఎంకే ఎమ్మెల్యే, శశికళ వర్గం నేత కరుణాస్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, పలు వార్త సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై సెప్టెంబర్ 16న జరిగిన ఒక ధర్నాలో కరుణాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్షమాపణలు సైతం చెప్పారు. అనంతరం కొన్ని రోజులుగా కరుణాస్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి.
అయితే, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో.. పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేయక తప్పలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న కురుణాస్‌ను అరెస్ట చేశామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించి స్పీకర్‌తో చర్చిస్తామని వెల్లడించారు. కాగా, అరెస్టుపై న్యాయపరంగా వెళ్తానని కరుణాస్ తెలిపారు. ఇదిలాఉండగా కరుణాస్ 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే టికెట్‌పై తిరవదనై నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment