లక్నో : సరైన కారణం లేకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం చేసినందుకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నవ్‌తన్వా ఎమ్మెల్యే అమన్‌మణి త్రిపాఠి ఆరుగురు అనుచరులతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లారు. సరైన కారణం లేకుండా ప్రయాణించడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించిన పోలీసులపై విరుచుకుపడుతూ దుర్భాషలాడారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిన కారణంగా ఐపీసీ సెక్షన్ 188, 269, 270 కింద కేసు నమోదు చేసి ఎమ్మెల్యేతో సహా అతని అనుచరులను అరెస్ట్ చేసి, రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ సంజీవ్ త్యాగి తెలిపారు.
అంతేకాకుండా అందరినీ పరీక్షించి ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ చేసినట్లు చెప్పారు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే సహా, అనుచరులు కేదర్‌నాథ్, బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్లెందుకు బయలుదేరగా, ఘజియాబాద్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకుముందు భార్యపై హత్యా ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా త్రిపాఠిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment