వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడి మృతి | ysrcp mandal leader died | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడి మృతి

Published Thu, Jan 4 2018 9:51 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

సత్తెనపల్లి(గుంటూరు జిల్లా): అచ్చంపేట వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు సందెపోగు సత్యం(52) ఆకస్మికంగా మృతిచెందారు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ వెళ్లేందుకు గురువారం ఉదయం సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌కు సత్యం వచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు. మూర్ఛవ్యాధితో కిందపడిపోయాడని భావించి తోటి ప్రయాణికులు, స్థానికులు అతని చేతిలో తాళాలు, ఇనుప వస్తువులు ఉంచారు. కాసేపటికే గుండెపోటుతో మరణించాడు. సత్యం మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి రాంబాబు, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌ నాయుడు సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement