sattena palli
-
విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్లో డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజీ బాగు చేసేందుకు లోపలికి వెళ్లిన వీరు ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు. మరొకరు బిల్డింగ్ యజమాని కొండలరావు. చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం! -
పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు.. కారణం అదే!
సత్తెనపల్లి: హత్య కేసును సత్తెనపల్లి పోలీసులు ఛేదించారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన యల్లంపల్లి చాంద్‌బాషా ట్రావెల్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గత ఏడాది భార్య, బిడ్డలను వదిలేసి సత్తెనపల్లిలో ఉంటూ తాపీ పనులకు వెళ్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు మేస్త్రీ బజారులో నివసిస్తున్న పైర్థల నాగమల్లేశ్వరితో సహజీవనం చేస్తున్నాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సహజీవనం చేస్తున్న చాంద్‌బాషాను అడ్డు తొలగించుకోవాలని నాగమల్లేశ్వరి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నాగమల్లేశ్వరితో పాటు రెంటచింతల గ్రామం దొమ్మరకాలనీకి చెందిన అన్నపురెడ్డి అమరయ్య అలియాస్ అమర్, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన తన్నీరు సుబ్బారావు ముగ్గురు కలిసి మద్యం సేవిద్దామని చాంద్‌బాషాను నమ్మించి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో స్టేడియంలోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి చాంద్‌బాషాను గొంతునొక్కి, గుండెలపై, వీపుపై గుద్ది హతమార్చారు. ఈ నెల 4న చాంద్‌బాషా మృతదేహాన్ని స్థానికులు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చాంద్‌బాషాను హత్య చేసినట్లు గ్రహించిన పోలీసులు సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి పర్యవేక్షణలో పట్టణ సీఐ యు.శోభన్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది. నాగమల్లేశ్వరి పథకం ప్రకారం మరో ఇద్దరితో కలిసి హతమార్చినట్లుగా తేలడంతో ముగ్గురి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోవడం, మిగిలిన ఇద్దరు కూడా కనిపించకపోవడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 7న నాగమల్లేశ్వరి, అమరయ్యను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి పట్టణ పోలీసు స్టేషన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శోభన్ బాబు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ హత్య కేసు ఛేదించడంలో సహకరించిన ఎస్ఐ రఘుపతిరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఎం.గంగాధరరావు, కె.రామారావు, కానిస్టేబుళ్లను డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, సీఐ శోభన్‌బాబు అభినందించారు. చదవండి: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన అధ్యాపకులు
సత్తెనపల్లి: అధ్యాపకులు సైతం తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తూ అధికారులకు దొరికిపోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) సీఐ ఈడె మారయ్యబాబు తెలిపిన వివరాలు.. సౌత్ సెంట్రల్ రైల్వే క్యాంటీన్ వర్కర్ రావూరి సాయికృష్ణ, పట్టణంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకుడు పొందుగల శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గంటా శ్రీనివాసరావు, వంట మాస్టార్ షేక్ వలీ ఒక బృందంగా ఏర్పడి నిత్యం రైల్లో తెలంగాణ మద్యం తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం సెబ్ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలు పెట్టుకుని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
కోడెల పంచాయతీ.. ‘డోంట్ వర్రీ’ అన్న బాబు!
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అక్రమాల పంచాయితీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా తొలగించాలంటూ టీడీపీ స్థానిక నేతలు తాజాగా చంద్రబాబును కలిశారు. సత్తెనపల్లి స్థానిక టీడీపీ నేతలు బుధవారం చంద్రబాబునాయుడిని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్గా తొలగించాలని వారు చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పార్టీ కార్యాలయం ఎదుట కూడా టీడీపీ శ్రేణులు కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అంతకుముందు కోడెల శివప్రసాదరావు స్వయంగా చంద్రబాబును కలిసి తన వాదన వినిపించారు. ఇటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అటు కోడెల వాదనలు వేర్వేరుగా చంద్రబాబు విన్నారు. కోడెలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు, కార్యకర్తల వాదనను విన్న చంద్రబాబు.. ‘యూ డోంట్ వర్రీ.. నేను చూసుకుంటా’ అని వారితో చెప్పి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కోడెల శివప్రసాద్‌ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కు నెట్టారని, కే–ట్యాక్స్‌ల పేరుతో సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా దోచుకున్నారని, ఇక ఆ కుటుంబ పెత్తనం మేం భరించలేమని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వారు తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ నియోజకవర్గ నాయకులు చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. కే–ట్యాక్స్ కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరువుపోయిందని, కోడెల నాయకత్వంతో పని చేయలేమని టీడీపీ నేతలు అధినేత వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది. -
కోడెల హఠావో... సత్తెనపల్లిలో ఉద్రిక్తత
సాక్షి, సత్తెనపల్లి/గుంటూరు : శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అవినీతికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కోడెల కుటుంబం అవినీతి, అరాచకాలతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి మద్దతుగా నిలిచేందుకు సత్తెనపల్లి తాలుకా సెంటర్లో ధర్నా చేసేందుకు అఖిలపక్షం నిర్ణయించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సహా పలువురు సీపీఐ, సీపీఎం, జనసేన, ఆప్, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి లేదని, ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందన్న కారణంతో అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
హవ్వ.. మరీ ఇంత కక్కుర్తా!
సాక్షి, గుంటూరు : ‘హవ్వ.. మరీ ఇంత కక్కుర్తా.. డబ్బు కోసం ఇంతకు దిగజారాలా.. పేదవాడి నోటి కాడ కూడును కూడా లాగేసుకుంటారా.. అన్న క్యాంటిన్లలోని భోజనం తరలించి సొమ్ము చేసుకుంటారా..’ అంటూ టీడీపీ నేతల వైఖరి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో ముఖ్య నేత తనయుడు, తనయ.. అన్న క్యాంటిన్లో భోజనాలను కూడా అమ్ముకుంటున్న దిగజారుడుతనాన్ని చూసి ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు తార స్థాయికి చేరాయి. మరీ ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే ముఖ్య నేత కుమారుడు, కుమార్తెల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వీరి కన్ను ఇప్పుడు అన్న క్యాంటిన్లపైనా పడింది. అన్న క్యాంటిన్లలో రూ.5కే భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని ముఖ్యనేత కుమార్తెకు చెందిన ఓ వ్యాపార సంస్థకు మధ్యాహ్నం 150, సాయంత్రం 150 చొప్పున రోజుకు 300 భోజనాలను చేరవేస్తున్నారు. అన్న క్యాంటిన్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. పోనీ తమ కంపెనీలో పనిచేసే కార్మికులకైనా ఉచితంగా భోజనాలు పెడుతున్నారా అంటే అదీ లేదు.. ఒక్కో భోజనానికి కార్మికుల వద్ద నుంచి రూ.25 వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీన్ని బట్టి రోజుకు భోజనాల ద్వారా కార్మికుల నుంచి రూ.7,500 చొప్పున నెలకు రూ.2.25 లక్షలు.. దోచేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేదలకు పెట్టే అన్నంలోనూ అంత కక్కుర్తి అవసరమా అంటూ ముఖ్యనేత కుటుంబ సభ్యులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కే ట్యాక్స్ కట్టాల్సిందే.. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం, వ్యాపార సముదాయాల విస్తరణ పూర్తిగా నిలిచిపోయిందంటే వీరు ఏ స్థాయిలో ‘కే’ (వారి ఇంటి పేరు) ట్యాక్స్ వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగుతున్న ముఖ్యనేత కొడుకు, కూతురు ప్రజలపై విధిస్తున్న కే ట్యాక్స్‌పై నోరు మెదపలేకపోతున్నారు. ఇవేకాకుండా పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న వారి నుంచి కూడా మామూళ్లు వసులుచేస్తున్నారు. చివరికి వారు తమ పార్టీ వారైనా సరే వదిలిపెట్టడం లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. రేషన్ మాఫియా దగ్గర నుంచి భూ కబ్జాల వరకూ దేన్నీ వదలడం లేదు. చివరకు కోటప్ప కొండ పండుగను సైతం తమ ధన దాహానికి వాడుకుని త్రికోటేశ్వరుని పవిత్రతకు భంగం కలిగించారు. తమ అనుచరుల ద్వారా కోడి పందాలు, గ్యాంబ్లింగ్, కోత ముక్కాటలను నిర్వహించి జనం వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని వారి జేబులు నింపుకొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగున్నరేళ్లలో వీరు చేసిన అవినీతి దందా వెయ్యి పేజీల పుస్తకమవుతుందని స్థానికులు వాపోతున్నారు. -
వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడి మృతి
సత్తెనపల్లి(గుంటూరు జిల్లా): అచ్చంపేట వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు సందెపోగు సత్యం(52) ఆకస్మికంగా మృతిచెందారు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళ్లేందుకు గురువారం ఉదయం సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌కు సత్యం వచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు. మూర్ఛవ్యాధితో కిందపడిపోయాడని భావించి తోటి ప్రయాణికులు, స్థానికులు అతని చేతిలో తాళాలు, ఇనుప వస్తువులు ఉంచారు. కాసేపటికే గుండెపోటుతో మరణించాడు. సత్యం మృతదేహాన్ని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి రాంబాబు, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
రూ.20 లక్షల విలువైన కోళ్లు చోరీ
గ్రామ శివారులో ఉన్న కోళ్లఫాంలపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు ఫాంలో ఉన్న రూ. 20 లక్షల విలువైన కోళ్లను దోచుకెళ్లారు. రెండు ఫాంలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాళ్ల వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ వివాదాస్పద స్థలంలో ఉన్న రెండు కోళ్లఫాంలపై దాడి చేసిన దుండగులు అందులో ఉన్న రూ.20 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు. -
టీడీపీ నేతపై కేసు నమోదు
సత్తెనపల్లి: మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్కూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన వైఎన్ షాపు పక్కన నాగేశ్వరరావు ఇటీవల దేవుడి బొమ్మ ఏర్పాటు చేశారు. దానిని ఓ వర్గం వారు తొలగించారు. వారికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొడుతుండటంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నడుస్తోంది.