నక్కపల్లి (విశాఖపట్నం) : విశాఖ జిల్లా నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం గంగవరం గ్రామానికి చెందిన 13 మంది రాజమండ్రి పుష్కరాలను వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు నక్కపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నక్కపల్లి వద్ద ఆటో బోల్తా: 17 మందికి గాయాలు
Published Tue, Jul 21 2015 2:19 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement
Advertisement