బంజారాహిల్స్: మద్యం మత్తులో గొలుసు పోగొట్టుకున్న ఓ వ్యక్తి చైన్‌స్నాచింగ్ జరిగిందంటూ 100కు ఫోన్ చేసి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీకృష్ణానగర్ నివాసి బి.సంతోష్‌రెడ్డి బుధవారం రాత్రి యజమానురాలిని ఎయిర్‌పోర్ట్‌లో వదిలి తన బర్త్‌డే సందర్భంగా పార్టీ ఇస్తానంటూ స్నేహితులు రఫీక్,మునీష్‌లను పిలిచాడు. అర్దరాత్రి ఓ వైన్‌షాపు వద్ద పీకల దాకా మద్యం తాగి పాయా తిందామంటూ కారులో ఓల్డ్‌సిటీ వెళ్లారు.
మద్యం మత్తులో ముగ్గురూ గొడవపడి పెనుగులాడారు. ఈ గొడవలో సంతోష్‌రెడ్డికి చెందిన రెండు తులాల బంగారు గొలుసు పడిపోయింది. తెల్లవారుజామున ఇంటికి వెళ్లిన సంతోష్‌రెడ్డి మెడలో గొలుసు కనిపించకపోవ డంతో 100 నెంబర్‌కు డయల్ చేసి స్నాచింగ్ జరిగిందంటూ సమాచారం ఇచ్చాడు. బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టగా ఆ గొలుసును తన స్నేహితులే కొట్టేసి ఉంటారంటారని వెల్లడించాడు. పోలీసులు నిందితులు రఫీక్, మునీష్‌ల కోసం గాలింపు చేపట్టారు.
మద్యం మత్తులో స్నాచింగ్ జరిగిందని...
Published Fri, Nov 13 2015 9:27 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement
Advertisement