హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నెల రోజుల వయసున్న ఓ బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బుధవారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ ఆవరణలో తల్లితోపాటు బాలుడు నిద్రిస్తున్న సమయంలో ఆగంతకులు అపహరించారు. బాలుడి తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా..అదే ప్రాంతంలోని ఓ హోటల్‌లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు కలిసి కిడ్నాప్ కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.