కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక అన్నారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ రుణమాఫీ సహా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టించేవారిని జైలులో పెట్టాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికల వామపక్షాల అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న గాలి వినోద్ కుమార్ నవంబర్ 2వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.