- డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు
అనంతపురం అర్బన్ : పౌర సరఫరాల శాఖలో అవినీతి ‘అధికార’ స్థాయిలో ఉందని, మొదట అక్కడి నుంచి ప్రక్షాళన చేపట్టాలని స్టోర్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు అన్నారు. ఆదివారం అనంతపురంలో జరిగిన డీలర్ల సంఘం రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 వేల మంది డీలర్లు ఉన్నారని, ఈ వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అవినీతి రహితమనేది పై నుంచి కింది స్థాయి వరకు ఉండాలన్నారు. అలాంటి పరిస్థితి ఏపీ పౌరసరఫరాల శాకలో లేదని, అధికారుల స్థాయిలోనే మితిమీరిన అవినీతి జరుగుతోందని చెప్పారు.
పౌరసరఫరాల శాఖలో మితిమీరిన అవినీతి
Published Sun, Aug 23 2015 7:03 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement