రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతి | Foreign Student killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతి

Published Sat, Mar 19 2016 9:49 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్‌లో శనివారం జరిగింది.

ఉస్మానియా యూనివర్సిటీ: రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్‌లో శనివారం జరిగింది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం ఇరాక్ దేశానికి చెందిన మహ్మద్ హైథన్ అబిద్ ఇబ్రహీమ్‌పట్నంలోని సెయింట్ పాల్స్ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ కోర్సు చదవుతున్నాడు. హబ్సిగూడ రవీంద్రనగర్ కాలనీలో ఉండే అతను తన బైక్ పై స్నేహితుడు సలాదిన్ కలసి వేగంగా వెళ్తుండగా అదుపు తప్పిన బైక్ హబ్సిగూడ ఆంధ్రాబ్యాంక్ సమీపంలో ఓ షాప్ మెట్లకు ఢీకొంది. హైథమ్ అబిద్ తలకు తీవ్రగాయాలతో పాటు శరీరంలో మరికొన్న చోట్ల బలమైన గాయాలవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక గల సలాదీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. తలకు హెల్మేట్ ఉంటే హైథమ్‌ అబిద్ ప్రణాల నుంచి బయటపడే వారని ఎస్సై ఉపేందర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement