వన రాజధానిగా అమరావతి
వనమహోత్సవంలో సీఎం
సాక్షి, విజయవాడ: అమరావతిని వన రాజధానిగా అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయవాడ నగర సమీపంలోని కొత్తూరు తాడేపల్లి రిజర్వు పారెస్టు ప్రాంతంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కలసి ఆయన మొక్కలు నాటారు. చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ప్రాంతాన్ని హరితవనంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
అడవుల అభివృద్ధికి రూ.55వేల కోట్లు..
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. అభివృద్ధితోపాటు మొక్కలపెంపకం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. దేశంలో పచ్చదనం, స్వచ్ఛభారత్, గ్రీన్‌ఇండియాకోసం 14వ ఆర్థికసంఘం ద్వారా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
ముస్లిం ఆడపిల్లల పెళ్లి బాధ్యత ప్రభుత్వానిదే: ఇఫ్తార్ విందులో సీఎం
ముస్లిం పేదల్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం కష్టంగా మారిందని, ఇకనుంచీ వారి పెళ్లి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర మైనార్టీశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ పేద ముస్లిం ఆడపిల్లలకోసం ఎన్ని కళాశాలలైనా పెట్టి, ఎంత ఖర్చుపెట్టయినా చదివిస్తామని చెప్పారు.
ఇమామ్‌లకు నెలకు రూ.4వేలు, మేజాలకు రూ.2వేలు చొప్పున గౌరవవేతనాలిస్తామని ప్రకటించారు.
* కొత్తూరు తాడేపల్లిలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్న సీఎం జక్కంపూడి గ్రామ సమీపంలో పోలవరం కుడికాల్వ తవ్వకం పనుల్ని పర్యవేక్షించారు.