మాజీ ఎంపీటీసీ హత్య
మాజీ ఎంపీటీసీ హత్య
Published Mon, Nov 21 2016 10:05 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
గిద్దలూరు: ప్రకాశంజిల్లా గిద్దలూరు మండలం మాజీ ఎంపీటీసీ దొనపటి రమణ(37) గడికోట గ్రామంలో సోమవారం హత్యకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రమణ తన పొలంలో వరి నాట్లు వేశారు. పందుల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు రాత్రి పొలంలో మంచె వద్ద కాపలాకు వెళ్లారు.
ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన గొంతు కోసి హత్య చేశారు. సంఘటనా స్థలంలో దుండగులు, రమణ మధ్య పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గ్రామంలో ఆయనకు ఎవరితోనూ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని స్థానికులు అంటున్నారు. రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement