న్యూఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్న కేసీఆర్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవ్వడంపై అభినందనలు తెలిపి టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుమారు 35 నిమిషాలపాటు ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు.
అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఎలాంటి రాజకీయాలు చర్చించుకోలేదన్నారు. ఇక తాను రాజకీయాలు మాట్లాడనని, దాని గురించి మాట్లాడేందుకు సంబంధిత వ్యక్తులున్నారన్నారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం మానేశానని అన్నారు.
వెంకయ్యకు కేసీఆర్ శుభాకాంక్షలు
Published Thu, Jul 27 2017 3:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
Advertisement
Advertisement