యప్ టీవీలో భారీ పెట్టుబడి | KKR-Backed Emerald Media invests US$50mn IN YUPPTV | Sakshi
Sakshi News home page

యప్ టీవీలో భారీ పెట్టుబడి

Published Thu, Oct 13 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

KKR-Backed Emerald Media invests US$50mn IN YUPPTV

ముంబై: ప్రముఖ గ్లోబర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్ధ కేకేఆర్ కు చెందిన ఎమరాల్డ్ మీడియా మీడియా రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. దాదాపు 50మిలియన్ యూఎస్ డాలర్లకు యప్ టీవీ(yupp tv)లో కొంత భాగాన్ని సొంతం చేసుకుంది. ఆన్ లైన్ లో దక్షిణ ఆసియా టీవీ ప్రసారాలకు యప్ టీవీ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా 14 భాషలకు చెందిన ప్రసారాలను యప్ టీవీ ఆన్ లైన్ లో అందిస్తోంది.

250 దక్షిణ ఆసియా టీవీ చానళ్ల ప్రసారాలు, 5వేలకు పైగా సినిమాలు, 100కు పైగా టీవీ షోలను ప్రేక్షకులకు యప్ టీవీ అందిస్తోంది. అమెరికా, యూకే, మధ్య ఆసియా, కెనడా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కరీబియన్ లలో మార్కెట్ పై యప్ టీవీ ప్రత్యేకదృష్టిని సారించింది. భారత్ లో కూడా యప్ టీవీకి ప్రాముఖ్యత ఉంది.

ఎమరాల్డ్ మీడియా కంటే బలమైన భాగస్వామిని మేం కోరుకోమని యప్ టీవీ సీఈవో ఉదయ్ రెడ్డి చెప్పారు. ఎమరాల్డ్ మీడియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్సంబధాలతో యప్ టీవీ ప్రసారాలకు ఉపయోగపడతాయని అన్నారు. దాదాపు 10మిలియన్లకు పైగా మొబైల్ యూజర్ల యప్ టీవీ అప్లికేషన్ ను వినియోగిస్తున్నారు. శాంసంగ్, ఎల్ జీ స్మార్ట్ టీవీల్లో ప్రీ ఇన్ స్టాల్డ్ యప్ టీవీ అప్లికేషన్ ను ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement