Yupp TV
-
బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్తో ప్రముఖ గ్లోబల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యప్ టీవీ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం కొత్త సర్వీసును తన యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు తన ఓటీటీ సేవలను మరింత విస్తరించేందుకు ‘యప్‌టీవీ స్కోప్ ప్లాట్‌ఫాం’ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు అన్ని ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఒకే ప్యాకేజీలో అందించనుంది. సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్ అండ్ లైవ్ టీవీ లాంటి ప్రీమియం ఓటీటీ సర్వీసులను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్ ఫాంల్లో ఇది అందుబాటులో ఉండనుంది. దీంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ డివైస్‌లు, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ సర్వీసులు ఎంజాయ్ చేయవచ్చు. ఏఐ, ఎంఎల్ సామర్థ్యాల వినియోగంతో యప్ టీవీ స్కోప్ అత్యంత క్యూరేటెడ్ అనుభవాన్ని అందిస్తుందనీ, మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్ ఆవిష్కరణను సులభతరం చేస్తుంది. యప్‌టీవీ వెల్లడించింది. కంటెంట్కోసం పలు యాప్‌ల అవసరం లేకుండానే తమ క్రాస్-ప్లాట్‌ఫాం ద్వారా, స్మార్ట్ టీవీ, పీసీ, మొబైల్, టాబ్లెట్.. వివిధ పరికరాలకు యాక్సెస్ పొందవచ్చు. అలాగే వినియోగదారులు లైవ్ టీవీని చూస్తూనే ప్రత్యక్ష చాట్లను నిర్వహించవచ్చు, ప్రత్యక్ష పోల్స్‌లో పాల్గొనవచ్చు. నచ్చిన కంటెంట్‌ను కూడా కోరుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో సింగిల్ సబ్స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ యుప్ టీవీ స్కోప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని యప్‌టీవీ వ్యవస్థాపకుడు ,సీఈఓ ఉదయ్ రెడ్డి వెల్లడించారు. అటు బీఎస్ఎనల్ఎల్ సీఎండీ సిఎండి శ్రీ పి.కె.పూర్వర్ కూడా ఈ సేవలపై సంతోషం వెలిబుచ్చారు. -
కస్టమర్లకు యప్ టీవీ మెగా ఆఫర్
ముంబై: కరోనా వైరస్ దెబ్బతో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లోనే సినిమాలు, కార్యక్రమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో(ఆన్లైన్) ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన యప్ టీవీ కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ క్రమంలో వినోధం కోరుకునే వారికి యప్ టీవీ 24జులై నుంచి జులై 28వరకు ఐదు రోజుల కాలపరిమితితో ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్ ప్రకటించిన రోజులలో యప్ టీవీ ద్వారా అందించే సినిమాలు, అన్ని కార్యక్రమాలకు ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం తెలుగులో విశేషాధారణ పొందిన జబర్దస్త, క్యాష్ లాంటి కార్యక్రమాలతో యప్ టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలమాళం, బెంగాళీ, కన్నడ, మరాఠి తదితర భాషలలో తక్కువ ప్యాకేజీతో కస్టమర్లను అలరిస్తోంది. అయితే వివిధ దేశాలలో యూప్ టీవీ వివిధ ప్యాకేజీలతో ప్రకటించింది. యూప్ టీవీలో క్లాసికల్ సినిమాల నుంచి ప్రస్తుత బ్లాక్‌బ్లస్టర్ సినిమాల వరకు 3,000సినిమాలు యప్ టీవీ అందిస్తోంది. వివిధ దేశాలలో యప్ టీవీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు ఆస్ట్రేలియాలో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు న్యూజిలాండ్‌లో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు యూకేలో సంవత్సర ప్యాకేజీ 69.99డాలర్లు యూరప్‌లో సంవత్సర ప్యాకేజీ 69.99డాలర్లు యూఎస్ఏ సంవత్సర ప్యాకేజీ 99.99డాలర్లు -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు యప్‌టీవీ!
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు త్వరలో యప్ టీవీ ట్రిపుల్ ప్లే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్–యప్ టీవీ సోమవారమిక్కడ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నాయి. ప్రత్యేక కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్, యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో 250 లైవ్ టీవీ ఛానల్స్, 5 వేలకుపైగా సినిమాలు, వందకుపైగా టీవీ షోలు, వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్, ఒరిజినల్ సిరిస్, ఫస్ట్ డే ఫస్ట్ షో లాంటి సేవలను అందిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా బీఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్లు, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందుబాటులోకి వస్తాయి. తాజా ఉదయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి గ్రామంలో బీఎస్ఎన్ఎల్ సేవలందిస్తోందని, వారందరికీ యప్‌టీవీ ట్రిపుల్ ప్లే సేవలు చేరువవుతాయని చెప్పారు. పునరుద్ధరణ ప్రణాళికపై సీఎండీ పుర్వార్ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను నెలలో ప్రజల ముందు ఉంచుతామని సంస్థ సీఎండీ పీకే పుర్వార్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయిస్తారని అంచనా వేస్తున్నట్టు తెలియజేశారు. ‘‘ఉద్యోగుల వేతనాలు దీపావళికి ముందే ఈ నెల 23, 24 నాటికి చెల్లిస్తాం. టెలికం రంగం సవాళ్లతో కూడిన దశలో ఉందని మనకు తెలుసు. పోటీ వల్ల టెలికం కంపెనీలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఎన్ఎల్కు ఇతర సమస్యలూ ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. పునరుద్ధరణ ప్యాకేజీ ద్వారా దీనికి పరిష్కారం చూపనున్నాం’’ అని పుర్వార్ వివరించారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ప్రభుత్వం అనుమతి తెలిపితే... రూ.74 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. బీఎస్ఎన్ఎల్ ఆస్తుల్ని విక్రయించడం ద్వారా దీన్ని రికవరీ చేసుకోవాలన్నది ప్రణాళిక. -
‘భజన బ్యాచ్’తో వస్తోన్న యప్‌టీవీ
సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకుని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్లైన్ వేదిక యప్ టీవీ తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇది సొంతంగా సీరియల్స్‌ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భజన బ్యాచ్ పేరుతో.. వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నట్లు యప్ టీవీ యాజమాన్యం తెలిపింది. దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న వాసుదేవ రెడ్డి (ఐడ్రీమ్), యప్‌టీవీ స్టూడియోలు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యప్ టీవీ యాజమాన్యం మాట్లాడుతూ.. 12 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్‌లో పోసాని కృష్ణమురళి, గెటప్ శ్రీను, జెమిని సురేష్, దీప నాయుడు, జోగి కృష్ణరాజు, షకలక శంకర్, బుల్లెట్ భాస్కర్, గణపతి, గోవింద్, సుధాకర్ రాఘవ, అప్పారావ్ వంటి ప్రముఖ హస్యనటులు నటిస్తున్నారని తెలిపారు. భజన బ్యాచ్ అనేది కామిక్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కనున్నట్లు తెలిపారు. భజనలే బతుకుతెరువుగా బండి లాగిస్తున్న ఓ వ్యక్తి వారసత్వంగా తన పిల్లలకు కూడా భజనలు నేర్పుతాడు. అయితే ఇది వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది.. వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఏర్పడిన పరిణామాలు వంటి అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. పంచ్‌లు, కామెడీ సన్నివేశాలు, ఆసక్తికర ట్విస్ట్‌లతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఉత్తమమైన ప్రాంతీయ అంశాలను అందించడమే మా ప్రధాన ధ్యేయం. ఈ క్రమంలో మేము మరో గొప్ప సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాము’ అని తెలిపారు. అంతేకాక ‘భజన బ్యాచ్’ అనేది ప్రధానంగా యువతనే కాక అన్ని వయసుల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు ఉదయ్ నందన్ రెడ్డి. -
యప్ టీవీ చేతికి బీసీసీఐ డిజిటల్ రైట్స్
న్యూఢిల్లీ: ఆసియా వార్తలను ముందుంచడంలో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న ఇంటర్నెట్ ఆధారిత స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ తమ సేవలను మరింత విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. 2019-20 సీజన్‌గాను మ్యాచ్‌లను అందించడానికి బీసీసీఐతో యప్ టీవీ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది తమ సర్వీసును మరింత విస్తరించాలని యోచిస్తున్న యప్ టీవీ.. ఈ మేరకు బీసీసీఐ నిర్వహించే హోమ్ సీజన్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి సిద్ధమైంది. ఈనేపథ్యంలో క్రికెట్ ఫాన్స్ అధికంగా ఉండే కాంటినెంటల్ యూరప్(నాన్ ఎక్స్‌క్లూజివ్ రూపంలో ), మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలతో పాటు మధ్య ఆసియా, మిడిల్ ఈస్ట్, సార్క్ దేశాలు(భారత్ మినహాయించి) యప్‌టీవీ ప్లాట్‌ఫామ్ ద్వారా దక్షిణాఫ్రికా-భారత్‌ల సిరీస్‌తో పాటు మిగతా సిరీస్‌లను కూడా వీక్షించే అవకాశం లభించింది. తమ తాజా డెవలప్మెంట్పై యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ బీసీసీఐ మ్యాచ్‌లను డిజిటల్ లైవ్ ద్వారా ప్రసారం చేయడానికి ఆతృతగా ఎదురుచూశాం. ఇక నుంచి బీసీసీఐ హోమ్ సీజన్ మ్యాచ్‌లను యప్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై అందిస్తున్నాం. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు చేరువయ్యే క్రమంలో మీ యొక్క ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్స్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ తాజా మా కమిట్మెంట్తో క్రికెట్‌ను సులభంగా వీక్షించ వచ్చు. మిలియన్ సంఖ్యలో ఉన్న క్రికెట్ ప్రేక్షకులకు ఇది రియల్ టైమ్ యాక్సెస్’ అని ఉదయ్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం 26 మ్యాచ్‌లు.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ నుంచి చూస్తే మొత్తం 26 మ్యాచ్‌లను యప్ టీవీ అందించనుంది. అదే సమయంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్ల భారత్ పర్యటన మ్యాచ్‌లను కూడా యప్ టీవీ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. భారత్ పర్యటనలో ఆయా జట్లు బెంగళూరు, మొహాలీ, ఢిల్లీ, పుణె, ఇండోర్, రాజ్‌కోట్, వైజాగ్, చెన్నై, హైదరాబాద్, గుహవాటి తదితర నగరాల్లో ఆడనున్నాయి. -
ఇక యప్టీవీలో ఐపీఎల్ ప్రసారాలు
ముంబై : వివో ఐపీఎల్ - 12వ సీజన్ భారతదేశ విదేశీ ప్రసార హక్కులను దక్షిణాసియా అంతటా ప్రఖ్యాతి గాంచిన యప్‌టీవీ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాతో పాటు సెంట్రల్ ఆసియా, ఆగ్నేయ ఆసియాలలో ఉన్న పాత, కొత్త వినియోగదారులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని యప్ టీవీ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా యప్‌టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2019 ప్రసార హక్కులు మాకు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు వారి అభిమాన క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం. ఇంటర్నెట్ ఆధారితంగా ఈ ప్రసారాలు కొనసాగుతాయని తెలిపారు. ఇందుకు గాను యూజర్లు https://www.yupptv.com/cricket/ipl-2019/live-streaming లాగిన్ అయ్యి ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు. అంతేకాక స్మార్ట్ టీవీలలో యప్‌టీవీ యాప్ ద్వారా, స్మార్ట్ బ్లూ - రే ప్లేయర్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలను పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానలు ఎదురు చూస్తున్న ఐపీఎల్ - 1 2వ సీజన్ ఈ నెల 23 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఉగాదికి యప్ టీవీ సొంత సీరియల్స్
⇒ ‘ఎందుకిలా’ సిరీస్ ప్రారంభం ⇒ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ సేవలందించే యప్ టీవీ.. సొంత సీరియల్స్ నిర్మించడంలో నిమగ్నమైంది. ఇందుకోసం యప్ టీవీ ఒరిజినల్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబును నియమించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపక సీఈఓ ఉదయ్ రెడ్డి గురువారమిక్కడ విలేకరులకు చెప్పారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ.. సీరియల్స్, కార్యక్రమాలను రూపొందించడం కోసం ఐ క్యాండీ క్రియేషన్స్, ఎర్లీ మార్నింగ్ టాలెస్, ట్రెండ్‌లౌడ్, మధుర ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలతో భాగస్వామ్యమయ్యామన్నారు. ‘‘ప్రముఖ దర్శకుడు దేవా కట్టా (ఐ క్యాండీ క్రియేషన్స్) నిర్మించిన ‘ఎందుకిలా’ సీరియల్ పూర్తయింది. ఉగాదికి ప్రసారమవుతుంది. ఆయా సీరియల్స్, కార్యక్రమాలు ఎపిసోడ్ల వారీగా ప్రసారమవుతాయి. తొలుత తెలుగులో రూపొందిస్తాం. తర్వాత తమిళం, హిందీ ఇతర భాషాలకు విస్తరిస్తాం. భవిష్యత్తులో సినిమాలు కూడా నిర్మిస్తాం’’ అని వివరించారు. ఇప్పటివరకు యప్ టీవీ 73 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఎమరాల్డ్ మీడియా వాటాను కొనుగోలు చేసింది. -
ఉగాదికి యప్ టీవీ సొంత సీరియల్స్
► ‘ఎందుకిలా’ సిరీస్ ప్రారంభం ► బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు హైదరాబాద్ : ఓవర్ ది టాప్ కంపెంట్ (ఓటీటీ) సేవలందించే యప్ టీవీ.. సొంతంగా సీరియల్స్ నిర్మించడంలో నిమగ్నమైంది. ఇందుకోసం యప్ టీవీ ఒరిజినల్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించింది. యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబును నియమించుకున్నట్లు సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ ఉదయ్ రెడ్డి గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ.. సీరియల్స్, కార్యక్రమాలను రూపొందించడం కోసం ఐ క్యాండీ క్రియేషన్స్, ఎర్లీ మార్నింగ్ టాలెస్, ట్రెండ్‌లౌడ్, మధుర ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలతో భాగస్వామ్యమయ్యామని చెప్పారు. ప్రముఖ దర్శకులు దేవా కట్టా (ఐ క్యాండీ క్రియేషన్స్) నిర్మించిన ‘ఎందుకిలా’ సీరియల్ పూర్తయిందని.. ఉగాదికి ప్రసారమవుతుందని కూడా చెప్పారు. ఆయా సీరియల్స్, కార్యక్రమాలు ఎపిసోడ్ల వారీగా ప్రసారమవుతాయని తెలియజేశారు. ముందుగా తెలుగులో రూపొందిస్తామని ఆ తర్వాత తమిళం, హిందీ ఇతర బాషాలకు విస్తరిస్తామని తెలిపారు. అలాగే భవిష్యత్తులో సినిమాలు కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు యప్ టీవీ 73 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఎమరాల్డ్ మీడియా వాటాను కొనుగోలు చేసింది. పార్క్ హయత్ హోటల్ ఫుడ్‌లో జెర్రి.. అయితే నగరంలో ప్రముఖ హోటల్స్‌లో ఒకటైన పార్క్ హయత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన భోజనంలో జెర్రి ప్రత్యక్షమైంది. ఓ మీడియా ప్రతినిధి తింటున్న స్వీట్లో జెర్రి కనిపించేసరికి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అక్కడి ప్రతినిధులు. వెంటనే సంబంధిత హోటల్ ప్రతినిధులకు ఈ విషయాన్ని చెప్పి.. ఇదేంటని ప్రశ్నించగా ‘‘అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని’’ లైట్ తీసుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు హోటల్ ప్రతినిధులు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకులు దేవా కట్టా, నందినీ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి భోజనం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. -
ఇక యప్ టీవీ సీరియల్స్...
సొంతంగా షూటింగ్; ఇప్పటికే 10 ఎపిసోడ్లు పూర్తి ♦ త్వరలో ఓ స్పోర్ట్స్, తెలుగు చానల్‌తో ఒప్పందాలు ♦ దీంతో ఆ చానల్స్ కార్యక్రమాలు యప్ టీవీకే పరిమితం! ♦ నెలకు రూ.99కే 250 చానల్స్ ప్రసారం; వీక్షకులు 50 లక్షలకు పైనే ♦ ఇప్పటికే రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ♦ ‘సాక్షి’తో యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యప్ టీవీ అంటే!! ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్లైన్ వేదికగా అభివర్ణిస్తారు. కానీ ఇపుడా యప్ టీవీ సొంతంగా సీరియల్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ నిర్మాణమూ పూర్తయింది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కూడా! ‘‘అంతేకాదు!! తొలిసారిగా ఓ స్పోర్ట్స్ చానెల్, ఓ తెలుగు చానెల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం చేసుకుంటున్నాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి’’ అంటూ తమ విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ గురించి యప్ టీవీ ఫౌండర్ సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... యప్కు బీజం ఇలా..: నోర్టెల్ నెట్వర్క్స్, సిమెన్స్ వంటి టెలికం కంపెనీల్లో దశాబ్ద కాలంపైనే పనిచేశా. టెలికం బూమ్‌తో విధుల నిమిత్తం చాలా దేశాలు తిరిగా. ఎక్కడికెళ్లినా నాకెదురైన ప్రధాన సమస్య.. అక్కడి టీవీల్లో మన భాషలోని చానెల్స్ రాకపోవటమే! టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందాక కూడా ఇదేంటని అనిపించేది. అదే యప్ టీవీ పునాదికి బీజం వేసింది. సాంకేతికత అభివృద్ధి, దక్షిణాది చానెల్స్‌తో ఒప్పందాలు, మార్కెటింగ్ కోసం మూడేళ్లు శ్రమించి రూ.2 కోట్ల పెట్టుబడితో జార్జియా ప్రధాన కేంద్రంగా 2006లో యప్ టీవీని ఆరంభించాం. ఒక్క మాటలో... స్థానిక భాషల్లోని టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని వాటి కంటెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా, ఎక్కడైనా, ఏ డివైజ్‌లోనైనా చూసుకునేదే యప్ టీవీ. 250 చానెల్స్; 25 వేల గంటల కంటెంట్..: ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల్లోని 250 టీవీ చానల్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. వీటిలో 102 వినోద చానెల్స్, 16 సినిమా, 30 మ్యూజిక్, 85 న్యూస్, 40 ఆధ్యాత్మిక చానెళ్లున్నాయి. వాటి కార్యక్రమాలు లైవ్ లేక రికార్డింగ్వి యప్ టీవీలో చూసుకోవచ్చు. ప్రస్తుతం మా టీవీలో 25 వేల గంటల నిడివి గల వీడియో కంటెంట్ ఉంది. సినిమాల కోసం యప్ ఫ్లిక్స్, షార్ట్ ఫిల్మ్సŠ, వెబ్ సీరియల్స్ కోసం యప్ బజార్ ఉన్నాయి. నెలకు రూ.99; వీక్షకులు 50 లక్షలకు పైనే ప్రస్తుతం ట్యాబ్లెట్స్, పీసీ, స్మార్ట్‌ఫోన్స్ ఇలా 27 రకాల డివైజ్‌ల ద్వారా... అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, మలేషియా, న్యూజిలాండ్, కరేబియన్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన 50 లక్షల మంది యప్ టీవీని చూస్తున్నారు. నెలకు చందా ధర రూ.99. అమెరికాలో అయితే నెలకు 20 డాలర్లు. ఇందులో 65–70 శాతాన్ని చానల్స్‌కు చెల్లిస్తాం. మిగిలింది మా ఆదాయం. ప్రస్తుతం 80 లక్షల యప్ టీవీ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి. రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి... 2017 ముగింపు నాటికి రూ.350 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా చేరుకున్నాం. ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.680 కోట్లు సమీకరించాం. గత అక్టోబర్‌లో అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ ఎమరాల్డ్ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇటీవల అమెరికన్ రిలైబుల్ ఐపీటీవీని సబ్స్క్రిప్షన్ విధానంలో కొన్నాం. అవకాశముంటే విదేశాల్లోని చానల్స్‌నూ కొనుగోలు చేస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు.. హైదరాబాద్‌లో స్థానిక నటులతో ఒక సీరియల్ తీస్తున్నాం. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో... తర్వాత మరాఠీ, బెంగాలీలో ప్రసారం చేస్తాం. 2017 ముగింపు నాటికి 20–25 ప్రోగ్రామ్స్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో ఒక స్పోర్ట్స్ చానల్, తెలుగు చానల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు చేసుకుంటాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి. ఈ అవకాశం ముందుగా అమెరికా సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే ఇస్తాం. -
యప్ టీవీలో భారీ పెట్టుబడి
ముంబై: ప్రముఖ గ్లోబర్ ఇన్వెస్ట్మెంట్ సంస్ధ కేకేఆర్ కు చెందిన ఎమరాల్డ్ మీడియా మీడియా రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. దాదాపు 50మిలియన్ యూఎస్ డాలర్లకు యప్ టీవీ(yupp tv)లో కొంత భాగాన్ని సొంతం చేసుకుంది. ఆన్ లైన్ లో దక్షిణ ఆసియా టీవీ ప్రసారాలకు యప్ టీవీ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా 14 భాషలకు చెందిన ప్రసారాలను యప్ టీవీ ఆన్ లైన్ లో అందిస్తోంది. 250 దక్షిణ ఆసియా టీవీ చానళ్ల ప్రసారాలు, 5వేలకు పైగా సినిమాలు, 100కు పైగా టీవీ షోలను ప్రేక్షకులకు యప్ టీవీ అందిస్తోంది. అమెరికా, యూకే, మధ్య ఆసియా, కెనడా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కరీబియన్ లలో మార్కెట్ పై యప్ టీవీ ప్రత్యేకదృష్టిని సారించింది. భారత్ లో కూడా యప్ టీవీకి ప్రాముఖ్యత ఉంది. ఎమరాల్డ్ మీడియా కంటే బలమైన భాగస్వామిని మేం కోరుకోమని యప్ టీవీ సీఈవో ఉదయ్ రెడ్డి చెప్పారు. ఎమరాల్డ్ మీడియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్సంబధాలతో యప్ టీవీ ప్రసారాలకు ఉపయోగపడతాయని అన్నారు. దాదాపు 10మిలియన్లకు పైగా మొబైల్ యూజర్ల యప్ టీవీ అప్లికేషన్ ను వినియోగిస్తున్నారు. శాంసంగ్, ఎల్ జీ స్మార్ట్ టీవీల్లో ప్రీ ఇన్ స్టాల్డ్ యప్ టీవీ అప్లికేషన్ ను ఇస్తున్నారు. -
‘యప్ టీవీ’లో ఇండో-పాక్ మ్యాచ్!
అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, యూరోప్, న్యూజిలాండ్, మలేషియాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను ‘యప్‌టీవీ’లో చూసి ఆనందించవచ్చని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యప్ టీవీ యాప్ ద్వారా ఆసియాకప్‌ను పూర్తిగా తిలకించవచ్చని ఆయన చెప్పారు. ‘భారత్‌లో క్రికెట్ ఓ మతం లాంటిది. ఇండియా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్‌లు ఎప్పుడూ భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులకు మా ద్వారా ఈ సేవలందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్నెట్కు కనెక్ట్ చేసి టీవీలు, మొబైల్స్, ట్యాబ్లెట్ల ద్వారా ఈ మ్యాచ్‌లు చూడొచ్చు’ అని ఉదయ్ తెలిపారు. -
యప్ టీవీకి ఏషియా కప్ డిజిటల్ రైట్స్
ఈనెల 24 నుంచి మార్చి 6 వరకు జరగనున్న ఏషియా కప్ టి 20 మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ మీడియా రైట్స్ తమకు సొంతం అయినట్లు యప్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. యప్‌టీవీ యాప్‌తో పాటు ఇంటర్నెట్ ఎనేబుల్డ్ పరికరాలలో కూడా ఈ టి20 మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందిస్తామని చెప్పింఇ. అమెరికా, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా దేశాలతో పాటు.. సింగపూర్‌లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఏషియా కప్ 2016ను యప్‌టీవీ ద్వారా చూడొచ్చు. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ బ్లూరే ప్లేయర్లు, స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్లు, ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏషియా కప్ టి20 టోర్నమెంటు నిర్వహిస్తారు. ప్రారంభ మ్యాచ్ భారత్- బంగ్లా జట్ల మధ్య జరుగుతుంది. ఈ తటస్థ వేదికపై భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 27న జరగనుంది. దక్షిణాసియా దేశాల్లో క్రికెట్‌కు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారని, ఇప్పుడు తాము ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ మీడియా రైట్స్‌ను దక్కించుకోవడం ద్వారా లైవ్ మ్యాచ్‌లను అభిమానులకు చూపించగలమని యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో పాటు అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు కూడా ఈ టోర్నమెంటు క్వాలిఫయింగ్ రౌండులో పాల్గొంటున్నాయి. -
యుప్ టివి ఇండియాకు వచ్చేసింది
-
యప్ టీవీ మీడియా ప్లేయర్ వచ్చేస్తోంది!
నచ్చిన సినిమా... మీకిష్టమైన సమయంలో చూడాలంటే...? సీడీ, డీవీడీ అందుబాటులో ఉండాలి. నెట్లోనైనా రెడీగా లభించాలి. లేదంటే.. మీ కోరిక తీరడం కష్టమే. కానీ... ఇంకో కొన్ని నెలలు ఓపిక పట్టారనుకోండి... ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా పదివేల సినిమాలు మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అంతే కాదు... వారం పది రోజుల క్రితం నాటి టెలివిజన్ సీరియళ్లు కూడా నింపాదిగా మీకు నచ్చిన టైమ్‌లో చూసేయవచ్చు. అదెలాగంటారా? అంతా యప్ టీవీ తయారు చేసిన పరికరం మహిమ! యప్ టీవీ గురించి మీరు వినే ఉంటారు. ఇంటర్నెట్ ద్వారా భారతీయ టెలివిజన్ ఛానళ్లను విదేశాల్లో ప్రసారం చేస్తున్న కంపెనీ ఇది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ దాదాపు 12 భాషలకు చెందిన 180 ఛానళ్లను ప్రసారం చేస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే తన లేటెస్ట్ ఉత్పత్తి ‘మీడియా ప్లేయర్’ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ ఐటీవీ మాదిరిగా ఉండే ఈ బుల్లి పరికరంతోపాటు యప్ టీవీ అభివృద్ధి చేసిన యూఎస్‌బీని కూడా వాడితే చాలు... ఎటువంటి ఎల్సీడీ/ఎల్ఈడీ టెలివిజనైనా ఇంటర్నెట్ కంటెంట్‌ను అందించే స్మార్ట్ టీవీగా మారిపోతుంది. దాంతోపాటే మీడియా ప్లేయర్ ద్వారా అన్ని ఛానళ్ల ప్రసారాలను పొందవచ్చు. సినిమాలు, టెలివిజన్ సీరియళ్లు అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ మీడియా ప్లేయర్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని నెలల్లో భారత్‌లోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ సీఈవో ఉదయ్‌నందన్ రెడ్డి ‘శాస్త్ర’కు తెలిపారు. ప్రస్తుతానికి తాము 1500 వరకూ సినిమాల ప్రసారానికి హక్కులు పొందామని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికల్లా పదివేల సినిమాల హక్కులు పొందుతామని ఆయన చెప్పారు. విశేషాలేమిటి? డెస్క్‌టాప్‌తోపాటు ఏకకాలంలో అన్ని రకాల డివెజైస్ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటివాటిపైనా పనిచేస్తుంది. రెండు పరికరాల మధ్య కూడా ప్రసారాలు సాఫీగా సాగిపోతాయి. ఉదాహరణకు మీరు టెలివిజన్‌లో ఓ సినిమా చూస్తున్నారనుకుందాం... అకస్మాత్తుగా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకోండి. టీవీ కట్టేసి... ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌ను ఓపెన్ చేస్తే చాలు. టెలివిజన్‌లో మీరు ఆపేసిన సీన్ తరువాతి సీన్‌తో సినిమాను చూడటం మొదలుపెట్టవచ్చు. టెలివిజన్ సీరియళ్ల విషయానికొస్తే.. దాదాపు పది రోజుల క్రితం నాటి టెలివిజన్ సీరియళ్లను కూడా మీకు అనుకూలమైన సమయంలో చూసుకునే వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో యప్‌టీవీ ద్వారా కేవలం వార్తాఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినోదాత్మక ఛానళ్లను కూడా నాలుగైదు నెలల్లో అందుబాటులోకి తెస్తామని యప్‌టీవీ సీఈవో తెలిపారు.