ఇక యప్‌టీవీలో ఐపీఎల్‌ ప్రసారాలు | YuppTV Bags The Digital Broadcast Rights For VIVO IPL 2019 | Sakshi
Sakshi News home page

ఇక యప్‌టీవీలో ఐపీఎల్‌ ప్రసారాలు

Published Tue, Mar 26 2019 2:57 PM | Last Updated on Tue, Mar 26 2019 3:02 PM

YuppTV Bags The Digital Broadcast Rights For VIVO IPL 2019 - Sakshi

ముంబై : వివో ఐపీఎల్‌ - 12వ సీజన్‌ భారతదేశ విదేశీ ప్రసార హక్కులను దక్షిణాసియా అంతటా ప్రఖ్యాతి గాంచిన యప్‌టీవీ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాతో పాటు సెంట్రల్ ఆసియా, ఆగ్నేయ ఆసియాలలో ఉన్న పాత, కొత్త వినియోగదారులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని యప్‌ టీవీ యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా యప్‌టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్‌ 2019 ప్రసార హక్కులు మాకు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు వారి అభిమాన క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం. ఇంటర్నెట్‌ ఆధారితంగా ఈ ప్రసారాలు కొనసాగుతాయని తెలిపారు. ఇందుకు గాను యూజర్లు  https://www.yupptv.com/cricket/ipl-2019/live-streaming లాగిన్‌ అయ్యి ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు. అంతేకాక స్మార్ట్‌ టీవీలలో యప్‌టీవీ యాప్‌ ద్వారా, స్మార్ట్‌ బ్లూ - రే ప్లేయర్‌ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలను పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానలు ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ - 1 2వ సీజన్‌ ఈ నెల 23 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement