న్యూఢిల్లీ: ఆసియా వార్తలను ముందుంచడంలో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న ఇంటర్‌నెట్ ఆధారిత స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ తమ సేవలను మరింత విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. 2019-20 సీజన్‌గాను మ్యాచ్‌లను అందించడానికి బీసీసీఐతో యప్ టీవీ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది తమ సర్వీసును మరింత విస్తరించాలని యోచిస్తున్న యప్ టీవీ.. ఈ మేరకు బీసీసీఐ నిర్వహించే హోమ్ సీజన్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి సిద్ధమైంది.
ఈనేపథ్యంలో క్రికెట్ ఫాన్స్ అధికంగా ఉండే కాంటినెంటల్ యూరప్(నాన్ ఎక్స్‌క్లూజివ్ రూపంలో ), మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలతో పాటు మధ్య ఆసియా, మిడిల్ ఈస్ట్, సార్క్ దేశాలు(భారత్ మినహాయించి) యప్‌టీవీ ప్లాట్‌ఫామ్ ద్వారా దక్షిణాఫ్రికా-భారత్‌ల సిరీస్‌తో పాటు మిగతా సిరీస్‌లను కూడా వీక్షించే అవకాశం లభించింది. తమ తాజా డెవలప్‌మెంట్‌పై యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ బీసీసీఐ మ్యాచ్‌లను డిజిటల్ లైవ్ ద్వారా ప్రసారం చేయడానికి ఆతృతగా ఎదురుచూశాం. ఇక నుంచి బీసీసీఐ హోమ్ సీజన్ మ్యాచ్‌లను యప్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై అందిస్తున్నాం. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు చేరువయ్యే క‍్రమంలో మీ యొక్క ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్స్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ తాజా మా కమిట్‌మెంట్‌తో క్రికెట్‌ను సులభంగా వీక్షించ వచ్చు. మిలియన్ సంఖ్యలో ఉన్న క్రికెట్ ప్రేక్షకులకు ఇది రియల్ టైమ్ యాక్సెస్’ అని ఉదయ్ రెడ్డి స్పష్టం చేశారు.
మొత్తం 26 మ్యాచ్‌లు..
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ నుంచి చూస్తే మొత్తం 26 మ్యాచ్‌లను యప్ టీవీ అందించనుంది. అదే సమయంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్ల భారత్ పర్యటన మ్యాచ్‌లను కూడా యప్ టీవీ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. భారత్ పర్యటనలో ఆయా జట్లు బెంగళూరు, మొహాలీ, ఢిల్లీ, పుణె, ఇండోర్, రాజ్‌కోట్, వైజాగ్, చెన్నై, హైదరాబాద్, గుహవాటి తదితర నగరాల్లో ఆడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment