‘యప్‌ టీవీ’లో ఇండో-పాక్ మ్యాచ్‌! | watch india versus pakistan match on yupp tv | Sakshi
Sakshi News home page

‘యప్‌ టీవీ’లో ఇండో-పాక్ మ్యాచ్‌!

Published Sat, Feb 27 2016 5:39 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

watch india versus pakistan match on yupp tv

అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, యూరోప్, న్యూజిలాండ్, మలేషియాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్‌ను ‘యప్‌టీవీ’లో చూసి ఆనందించవచ్చని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యప్‌ టీవీ యాప్‌ ద్వారా ఆసియాకప్‌ను పూర్తిగా తిలకించవచ్చని ఆయన చెప్పారు.

‘భారత్‌లో క్రికెట్ ఓ మతం లాంటిది. ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లు ఎప్పుడూ భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులకు మా ద్వారా ఈ సేవలందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి టీవీలు, మొబైల్స్, ట్యాబ్లెట్ల ద్వారా ఈ మ్యాచ్‌లు చూడొచ్చు’ అని ఉదయ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement