కూతుళ్లను బావిలోకి తోసేసి, తానూ... | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

కూతుళ్లను బావిలోకి తోసేసి, తానూ...

Published Wed, Apr 13 2016 5:10 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Married woman commits suicide

దంపతుల మధ్య కలహాలు మూడు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి తాను కూడా దూకి, చనిపోయింది. విజయనగరం జిల్లా రాజాం మండలం గడ్డిముడిదాం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గునుకూరు సింహాచలం, లక్ష్మి(32) దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు.

 

గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం లక్ష్మి తన ముగ్గురు కూతుళ్లను తీసుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు చేరుకుంది. చిన్న కుమార్తెలిద్దరినీ బావిలోకి నెట్టేసిన అనంతరం మూడో కూతురును కూడా పడేయాలని ప్రయత్నించింది. దీంతో ఆ బాలిక తల్లికి అందకుండా గ్రామంలోకి పరుగు తీసింది. అనంతరం లక్ష్మి కూడా బావిలోకి దూకేసింది. వెంటనే ఎవరూ గమనించకపోయేసరికి ముగ్గురూ చనిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement