ఆస్పత్రి వద్ద రమ్య బంధువుల ఆందోళన | panjagutta-road-accident-ramya-grand-father-died | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి వద్ద రమ్య బంధువుల ఆందోళన

Published Mon, Jul 18 2016 12:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM

panjagutta-road-accident-ramya-grand-father-died

హైదరాబాద్: యశోద ఆస్పత్రి వద్ద చిన్నారి రమ్య బంధువులు ఆందోళన చేపట్టారు. పంజాగుట్టలో ఈనెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితులను తమకు చూపించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వీల్లేదంటూ వారు ఆందోళన చేస్తున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement