హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా మావోయిస్టుల స్థావరాలు లేవని డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ త్వరలో 4,300 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు కు ప్రతిపాదనలు పంపామన్నారు.