ఖమ్మం: బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి రేపటి నుండి రెండు రోజుల పాటు ఖమ్మంలో దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని గతంలో పార్లమెంట్లో ప్రస్థావించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన ప్రభుత్వ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఖమ్మంలో 600 మంది దళితులకు కెటాయించిన ఇళ్ల స్థలాలను వారికి అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
'బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి'
Published Sun, Nov 22 2015 4:15 PM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement
Advertisement