'2018 నాటికి పోలవరం పూర్తి చేయాలి'
Published Tue, Dec 29 2015 11:00 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
రాజమండ్రి: రబీలో ప్రతి ఎకరానికీ రాష్ట్ర ప్రభుత్వం నీరు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా డిమాండ్ చేశారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ మొత్తం ముడుపుల బాగోతమని ఆరోపించారు. రైతులు పక్షాన ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్, కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement