
రోహిత్ అమ్మమ్మ మృతి
గుంటూరు(నెహ్రూనగర్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి వేముల రోహిత్ అమ్మమ్మ బాణాల అంజనీదేవి(74) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి ఒత్తిళ్ల కారణంగానే ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ‘మమ్మల్ని పెంచిన ఆమె ఇకలేరు. హృద్రోగి అయిన అమ్మమ్మకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. రోహిత్ ఆత్మహత్యపై స్థానిక అధికారులు రోజుకి ఐదారుగంటల పాటు ప్రశ్నించడంతో హృద్రోగి అయిన ఆమె ఒత్తిడికి గురైంద’ని రోహిత్ సోదరుడు రాజా ఢిల్లీలో వెల్లడించారు.