ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లా లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. ఘట్ కేసర్ మండలంలోని అన్నోజిగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దిల్‌సుఖ్ నగర్ కు చెందిన సతీష్(27) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
ఈ రోజు ఆఫీస్ బైక్‌పై బయలు దేరిన సతీష్ అన్నోజిగూడ వద్ద ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో మృతి చెందాడా.. లేక ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.