జాతరకు నాలుగు ప్రత్యేక రైళ్లు
Published Mon, Feb 15 2016 10:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM
కాజీపేట రూరల్(వరంగల్ జిల్లా): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. మేడారం స్పెషల్ ట్రైన్స్‌గా ఈనెల 17 నుంచి 21 వరకు నాలుగు రైళ్లను 8 ట్రిప్పులుగా తిప్పుతామని రైల్వే అధికారులు తెలిపారు.
రైళ్ల వివరాలు..
17వ తేదీన 07019 నంబర్ రైలు కాజీపేట జంక్షన్ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరి 11 గంటలకు సిర్పూర్‌కాగజ్‌నగర్ చేరుకుంటుంది. 21న ఇదే రైలు 07020 నంబర్‌తో సిర్పూర్ కాగజ్నగర్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 9 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. 18,19 తేదీలలో 07009 నంబర్ రైలు సిర్పూర్ కాగజ్నగర్లో ఉదయం 5.30 గంటలకు బయలు దేరి 11.15 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. 17,20 తేదీలలో 07007 నంబర్ రైలు సికింద్రాబాద్‌లో 12.30 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 15.40 గంటలకు చేరుకుంటుంది. ఇదే రైలు 17,20 తేదీలలో 07008 నంబర్‌తో వరంగల్‌లో 17.45 గంటలకు బయలుదేరి 21.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 17,20 తేదీలలో 07436 నంబర్‌తో సికింద్రాబాద్‌లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 12.45కు వరంగల్ చేరుతుంది. 17, 20 తేదీలలో 07437 నంబర్‌తో వరంగల్‌లో 13.15 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు 16.30 గంటలకు చేరుతుంది.
Advertisement
Advertisement