
శ్రీవారి బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోస్టర్లను, బుక్‌లెట్లను టీటీడీ విడుదల చేసింది. సోమవారం అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి ఈఓ సాంబశివరావు పోస్టర్లను విడుదల చేశారు. సెప్టెంబర్ 16 న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 24 న ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14 న ప్రారంభమై 22 వరకు కొనసాగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. అనంతరం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది.