
కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి
కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కాదు.. వారిని రెగ్యులరైజ్ చేసి జీతాలను అందించాలని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు.
అప్పటి వరకు ఆందోళనలు చేస్తాం: ఎర్రబెల్లి
హైదరాబాద్: కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కాదు.. వారిని రెగ్యులరైజ్ చేసి జీతాలను అందించాలని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రభాకర్ చేస్తున్న దీక్ష ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఆయన దీక్షకు మద్దతు తెలిపిన ఎర్రబెల్లి.. అనంతరం మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ చేస్తున్న పిచ్చి చేష్టలు సీఎంకు సంబరమనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సమ్మె చేసిన కార్మికులను తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ధర్నాలు, ఆందోళన చేస్తామన్నారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న పోరాటం రాజకీయ లబ్ధికోసం కాదని ఆకలి మంటల పోరాటమని దీన్ని కూడా రాజకీయమనుకుంటే ఇంత కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదన్నారు.