
సాక్షి, హైదరాబాద్: విజయవాడ, జిం ఖానా మైదానంలో శనివారం ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సం ఘీభావంగా నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యానికి సం బంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దా ఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమ వారం ఏపీ పోలీసులను ఆదేశించింది.
తదుపరి విచారణను 4 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28న కంచ ఐలయ్యకు సంఘీభావంగా తలపెట్టిన కార్యక్రమానికి అనుమతిని ఇవ్వకుండా పోలీసులను ఆదేశించాలంటూ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కె.విద్యాధరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment