kanche ilayya
-
September 17th: విమోచన కాదు, సమైక్యత!
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది! తెలంగాణలో సెప్టెంబర్ 17... ఆరెస్సెస్/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరెస్సెస్/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు. జునాగఢ్ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్ మహబత్ ఖాన్జీ పాకిస్తాన్లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్ నిలిచింది. కానీ ఆరెస్సెస్/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్ పటేల్ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్‌గా 1948 సెప్టెంబర్ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారత యూనియన్‌లో కశ్మీర్ 1947 అక్టోబర్ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్ రాజు పాకిస్తాన్‌తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్‌లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్ ప్రసిద్ధుడు. కశ్మీర్ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది. ఆరెస్సెస్ కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ! ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్ఎస్ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగిందని? భారత యూనియన్‌లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా! ‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్లో భారీ సర్దార్ పటేల్ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్‌లను విశాల భారత్‌లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్ శిబిరం నుంచి సర్దార్ పటేల్‌ను లాగి, ఆయనను ఆరెస్సెస్/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు? పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్ పటేల్‌కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం. - ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లాడాలని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అన్నారు. కానీ ఇంగ్లిష్ రాజ్యమేలుతున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన సౌకర్యవంతంగా విస్మరించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని అడ్డుకుంటే, దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. హిందీని అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు... ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా వారిలో తుంచేయాలని చూస్తే ఎలా? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా నిలిచిందంటే... భారత్ మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళుతుంది. ఒకే దేశం, ఒకే భాష అని ప్రబోధిస్తున్న ఆరెస్సెస్, బీజేపీల ఎజెండా మళ్లీ ముందు కొచ్చింది. హిందీని జాతీయ, అధికారిక భాషగా ఆమోదించాలంటూ దక్షిణ భారతదేశంపై, ఈశాన్య భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వ పథకం కూడా ముందుకొచ్చింది. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలి ప్రకటన చూస్తే మరింత సీరియస్ అంశాన్ని అది సూచిస్తోంది. అధికార భాషా కమిటీ చైర్మన్ హోదాలో కేంద్ర హోంమంత్రి 2022 ఏప్రిల్ 7న ఒక డేరింగ్ ప్రకటన చేశారు. ‘దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లా డాలి’ అనేశారాయన. గుర్తించాల్సింది ఏమిటంటే, సాధారణంగా ఇంగ్లిష్‌ని ప్రధానమైన భావవ్యక్తీకరణ భాషగా కలిగి ఉంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన పూర్తిగా విస్మరించేశారు. అమిత్ షా ప్రకటనకు సరిగ్గా ఒకరోజు ముందు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్పర్సన్ ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ, భారత దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లు నెలకొల్పు కోవడానికి ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ క్యాంపస్‌లలోని విద్యార్థులు, టీచర్లు హిందీ మాట్లాడతారా? ‘అశోకా’ లేదా ‘ఎమిటీ’ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌కి బదులుగా హిందీలో బోధించాలని అమిత్ షా కోరగలరా? ఒకటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రి జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలను హిందీ మీడియం విద్యాసంస్థలుగా మార్చాలని చూస్తున్నారు. భారతదేశ భాషా బాహుళ్యవాదం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడానికి ముందు, ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని వ్యతిరేకించడం ద్వారా దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలను చూడటం ముఖ్యం. ప్రభుత్వ రంగం లోని పరిశ్ర మలను, విద్యాసంస్థలను ప్రైవేటీకరించాలని బలంగా ప్రభోధిస్తున్న వారిలో అమిత్ షా ఒకరు. అయితే దేశంలోని దాదాపు అన్ని ప్రైవేట్ రంగ విద్యాసంస్థలూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్ని, కళాశాలలనే నడుపుతున్నాయన్న విషయాన్ని అమిత్ షా విస్మరిస్తున్నారు. హిందీని బోధనా భాషగా, అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ రాబడిని తెచ్చిపెడుతున్న ప్రధాన వనరు అయిన సాఫ్ట్వేర్ కంపెనీలలో హిందీని అమలు చేయడానికి అమిత్ షా ప్లాన్ ఏమిటి? దక్షిణ భారత, ఈశాన్య భారత రాష్ట్రాలను హిందీ మాట్లాడాలని నిర్బంధిస్తే, వాటి భాషలు, వాటి వ్యక్తీకరణ సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయి. హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలపై హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఇదే మొదటిసారి కాదు. అంతర్గతంగా, బాహ్యాంగా ఆర్థిక సంబంధాలలో ఇంగ్లిష్ ఒకే విధమైన స్థాయిని పొందని కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే దేశవ్యాప్తంగా హిందీ అమలు కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. తమిళనాడు ప్రథమ ముఖ్యమంత్రిగా సి.రాజగోపాలాచారి పాలిస్తున్నప్పుడు 1937–1940 మధ్యకాలంలో రాష్ట్ర జనాభాపై హిందీని రుద్దాలని ప్రయత్నించారు. దీంతో హిందీ వ్యతిరేక ఉద్యమం అక్కడ తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ శిబిరంలో రాజ గోపాలాచారి ఒక మెతకస్వభావం కలిగిన హిందుత్వ వాదిగా ఉండే వారు. హిందీపై ఆయన వైఖరి కాంగ్రెస్‌లోని బ్రాహ్మణ సిద్ధాంత కర్తలను విభజించి వేసింది. ఉదాహరణకు టి.టి. కృష్ణమాచారి పక్కా హిందీ వ్యతిరేకిగా, ఇంగ్లిష్ సమర్థకుడైన నేతగా ఉండేవారు. అయితే తమిళనాడుపై హిందీని నిర్బంధంగా రుద్దడానికి వ్యతిరేకంగా శూద్ర, దళిత ప్రజానీకాన్ని కూడగట్టిన ఘనత పెరియార్ రామస్వామి నాయకర్‌కే దక్కాలి. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం చేసిన హిందీని రుద్దాలనే ప్రయత్నం తమిళనాడులో భారీ స్థాయి ఆందోళనలకు, కాల్పులకు దారితీయడమే కాదు... చాలా మంది ఆత్మాహుతికి కూడా కారణమైంది. ఈ క్రమంలో హిందీ వ్యతిరేక పోరాటంలో 70 మంది ప్రజలు చనిపోయారు. ఫలితంగా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పొందింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత అన్నాదురై తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చరిత్ర తెలిసిందే. అయితే తమిళ ప్రజల ఇంగ్లిష్ అనుకూల ఆందోళనల వల్ల ఎవరు లబ్ధి పొందారు అంటే తమిళ బ్రాహ్మణులే. వీరు చాలావరకు ప్రైవేట్ క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో చదువుకున్నారు. బ్రాహ్మ ణిజంపై తిరుగుబాటు చేసిన తమిళ బ్రాహ్మణ మహిళ గీతా రామ స్వామి... ఇటీవల రాసిన తన జ్ఞాపకాల్లో (ల్యాండ్, గన్స్, క్యాస్ట్, విమెన్) ఇంట్లోనూ, తాను చదువుకున్న ఇంగ్లిష్ మీడియం పాఠశాల లోనూ పరస్పర వ్యతిరేకమైన విశ్వాసాల మధ్య తన బాల్యం గడిచి పోయిందని చెప్పారు. ఇంట్లో బ్రాహ్మిన్గానూ, పాఠశాలలో కేథలిక్ గానూ తాను గడిపానని ఆమె చెప్పారు. రుతుస్రావం అనేది భయంకరమైన కాలుష్యమని, రజస్వలగా ఉన్నప్పుడు దేవతా విగ్రహాలను తాకితే అవి మైలపడిపోతాయనీ, విరిగిపోతాయనీ బ్రాహ్మణ భావజాలంతో కూడిన ఇల్లు ఆమెకు నేర్పింది. కానీ ఆమె చదివిన పాఠశాల మాత్రం రుతుస్రావం అంటే తనలోని సంతాన శక్తిని చాటే ప్రక్రియ అని ఆమెకు బోధించింది. ఈ విధంగా సమాజంలోని అన్ని ఇతర కులాల వారికంటే బ్రాహ్మణు లను, వైశ్యులను ఇంగ్లిష్ విద్య విముక్తి చేసి పడేసింది. ఈరోజు దేశంలోని బడా బడా బనియా పారిశ్రామిక వేత్తలు ఇంగ్లిష్‌లోనే వ్యవ హరాలు నడిపిస్తున్నారు. పైగా ప్రపంచ స్థాయి ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, కళాశాలలను నడుపుతున్నారు. మరి హిందీ సమర్థకులైన అమిత్ షా వాటిని మూసివేయాలని ప్లాన్ చేస్తున్నారా? భారతదేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. కానీ వారిలో అంత ర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా తుంచే యాలని అమిత్‌షా కోరుకుంటున్నారు. దేశం లోపల కూడా ఇంగ్లిష్‌ను మాట్లాడే, రాసే సామర్థ్యం లేకపోవడం కారణంగానే ఈ కమ్యూని టీలకు ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో స్థానం లేకుండా పోతోంది. వీరు ఇంగ్లిష్‌ను మాట్లాడలేకపోతే, వారు దాన్ని ఎలా నేర్చుకోగలు గుతారు? ఈ ఇంగ్లిష్ విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణ మూలాలు కలిగిన కమలా హారిస్ ఏకంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగలిగారు. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ కాగలిగారు. ఇది మాత్రమే కాదు... వారిలో పటిష్టంగా ఉన్న ఇంగ్లిష్ మీడియం విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణులు చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థానాలను చేజిక్కించుకోగలిగారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉంటున్న నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్న ఎస్.జైశంకర్ ఆ ఇంగ్లిష్ విద్యా వారసత్వానికి కొనసాగింపు గానే నిలుస్తున్నారు. ఇంతేకాదు. అమిత్‌షా దేశాన్నే దహించివేయగల మరొక ఎజెండాపై కూడా కృషి చేస్తున్నారు. విస్తరించిన ఇంగ్లిష్ భాషా పునాది సహాయం తోనే భారత్, చైనా దేశాలు నేడు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడుతు న్నాయి. జాతీయవాద వాగాండబరం ఎలా ఉన్నా, అది ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతి రేకంగా ప్రభావం కలిగించిందంటే... భారతదేశం మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళ్తుంది. జాగ్రత్త! కంచె ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మార్క్సిజం నుంచి దళిత బహుజనం దాకా..
నివాళి ఉసాగా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడైన ఉ. సాంబశివరావు (1950 –2020) హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా వైరస్‌కు చికిత్స చేయించుకుంటూ శనివారం వేకువజామున కన్నుమూశారు. వేలాది మంది తన అభిమానులు, అనుయాయులకు కనీస సమాచారం తెలియకుండానే అయనను కోవిడ్–19 వైరస్ బలి తీసుకుంది. దళిత–బహుజన వర్గాలకు, ఆయన అభిమానులకు ఇది కచ్చితంగా అశనిపాతం లాంటి వార్తే అవుతుంది. తెనాలి సమీపంలోని కుగ్రామంలో ఒక నాయీబ్రాహ్మణ కుటుం బంలో పుట్టిన ఉసా 1960ల ప్రారంభంలో తెనాలి డిగ్రీ కాలేజీలో యువ విద్యార్థిగా ఉంటున్నప్పుడు హేతువాదిగా జీవితం ప్రారంభించారు. నక్సల్బరీ ఉద్యమం బద్దలయ్యాక ఉసా కమ్యూనిస్టు విప్లవ సిద్ధాంతం వైపు ఆకర్షితులై తరిమెల నాగిరెడ్డి పార్టీలో చేరారు. బహుముఖ ప్రతిభాపాటవాలతో ఉసా సిద్ధాం తకారుడిగా, రచయితగా, గాయకుడిగా పరిణమిం చారు. సాయుధపోరాటం వైపు మొగ్గుచూపి తూర్పుగోదావరి జిల్లా కొండమొదలు గిరిజన విముక్తి పోరాటంలో పాల్గొనడానికి వెళ్లి 1980ల వరకు అక్కడే నివసించారు. తెలంగాణలో ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో తీవ్రమైన కరువు వ్యాపించడంతో తాగునీరు, సాగునీరు సౌకర్యం కల్పించాలనే డిమాండుతో మోత్కూరు రైతులను సంఘటితం చేసేందుకు బాధ్యతలను చేపట్టారు. మోత్కూరులోనే అయిదేళ్లు నివసించిన ఉసా కులంతో పనిలేకుండా రైతు కుటుంబాల్లో ఒకరిగా కలిసిపోయారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక వ్యవసాయ సమస్యలపై వేలాదిమందిని కదిలించారు. అదే సమయంలో 1985లో కారంచేడు దళితులపై హత్యాకాండ ఘటన జరిగింది. ఉసా శషభిషలు లేకుండా దళిత్ మహాసభ, దళిత ఉద్యమంవైపు నిలిచాడు. తనతో విభేదించిన యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) తర్వాత ఉసాను పార్టీనుంచి బహిష్కరించింది. ఉద్యమంలో తనతోపాటు పనిచేసిన సహచరితోపాటు బయటకు వచ్చిన ఉసా ఆనాటి నుంచి సామాజిక సంస్కరణల్లో, కుల వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీపేట దళితులపై వేధింపు ఘటన చోటు చేసుకున్నప్పుడు కే.జీ. సత్యమూర్తితో కలిసి అక్కడి శిబిరంలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత 1987–89 మధ్య కాలంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రత్యేకించి కృష్ణానది గట్టుపై ఉన్న గ్రామాల్లో కరువుబారిన పడిన ప్రజలకు సహాయం చేసే కృషిలో నాతో పాటు పనిచేశారు. ఆ గ్రామాల్లో తోటి కార్యకర్తలతో కలిసి రెండున్నర సంవత్సరాలు గడిపి ప్రజల బాగోగులు పట్టించుకున్నారు. ఈలోగా మండల్ ఉద్యమం పొడసూపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ప్రజలను కూడగట్టడంలో ఉసా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. కేజీ సత్యమూర్తి మావోయిస్టు పార్టీ నుంచి బయటకివచ్చాక ఇరువురూ కలిసి ‘ఎదురీత’ పత్రిక స్థాపించారు. అటు మార్క్సిజం, ఇటు అంబేడ్కరిజం రెండిం ట్లోనూ ఉసా కీలకమైన సిద్ధాంతవేత్తగా, గొప్ప వక్తగా పరిణమించారు. ఆయన రచనలు, ప్రసంగాలు మారోజు వీరన్న వంటి విప్లవోద్యమ కార్యకర్తలను సైతం ప్రభావితం చేశాయి. తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైంది. ఉసా ఆంధ్రప్రాంతంలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ అనేక సమావేశాలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సీపీఎం మద్దతుతో ఏర్పడిన టి–మాస్, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌లో ఊసా భాగమయ్యారు. కులాంతర వివాహాలకు ఉసా గొప్ప మద్దతుదారు. తాను స్వయంగా పార్టీలో పనిచేస్తున్న బ్రాహ్మణ కార్యకర్త పద్మను వివాహమాడారు. కొన్నేళ్ల క్రితం ఆమె చనిపోయారు. తమ ఏకైక కుమార్తెను చక్కగా చదివించారు. పార్టీనుంచి బయటకొచ్చాక పద్మ ఉద్యోగం చేయడం మొదలెట్టి సహచరుడికి మద్దతుగా నిలిచారు. సూరేపల్లి సుజాతతో కలిసి బహుజన సాంస్కృతిక సంస్థను ప్రారంభిం చిన ఊసా భావజాల ప్రచారం కోసం దేశి–దిశ అనే పేరిట యూట్యూబ్ చానల్ మొదలెట్టారు. కులపరమైన అత్యాచార ఘటనలు ఎక్కడ జరిగినా మొట్టమొదటగా అక్కడికి వెళ్లేవారు. స్వయంగా అనేక కులాంతర వివాహాలను జరిపించారు. మహిళల హక్కులు, సమానత్వం పట్ల తాను చూపిన నిబ ద్ధత సాటిలేనిది. పితృస్వామ్యం నుంచి మహిళ ఎలా విముక్తి చెందాలో చెబుతూ అనేక రచనలు చేశారు కూడా. గిరిజన ప్రాంతాల్లో కానీ, మోత్కూరు, కొల్హాపూర్ గ్రామాల్లో కానీ లేక దళిత్–బహుజన వాడల్లో వేధించబడిన ప్రతి ఒక్కరితోనూ ఆయన కలగలిసిపోయారు. పూలే, అంబేడ్కరిజంపై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. కాలేజీ రోజుల నుంచి రాయడం ప్రారంభించారు. హేతువాదం, సైన్స్, బుద్ధిజం పట్ల విశ్వాసం ఉన్నవాడిగా మూఢనమ్మకాలు, అజ్ఞానం పట్ల బద్ధవిరోధాన్ని ప్రకటించేవారు. తన రాజకీయ, సైద్ధాంతిక కార్యాచరణలో భాగంగా ఆయన అనేకమంది ప్రజల ఇళ్లలో గడిపారు. ఒక విప్లవకారుడిగా, మానవ హక్కుల సమర్థకుడిగా, కులవ్యతిరేక ఆదర్శవంతుడిగా, మార్క్స్, మహాత్మాపూలే, అంబేడ్కర్ అనుయాయిగా ఉసా వారసత్వం సాటిలేనిది. సామ్యవాద, శాస్త్రీయ సమాజాన్ని నిర్మించాలని కోరుకున్న వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని బలిగొంటున్న కొత్త వైరస్‌ని నిరోధించలేకపోతున్న, అభివృద్ధి చెందని వైద్యశాస్త్రం కారణంగా మనల్ని వదిలి వెళ్లిపోయారు. ప్రపంచ వైద్యశాస్త్రం కరోనా వైరస్‌ని నిర్మూలించిన రోజు మాత్రమే.. అన్నిరకాల సాంక్రమిక వ్యాధులపై శాస్త్ర విజ్ఞానం జయించడం సాధ్యమవుతుందని విశ్వసించిన ఉసా ఆకాంక్ష నెరవేరుతుంది. మానవ సమానత్వం కోసం అలుపులేని పోరాటం సాగించిన ఉసా రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన పాదముద్రలు వదిలి వెళ్ళారు. వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ఇంగ్లిష్ చదివితే మతం మారతారా!
పేద, దిగువ కులాలకు చెందిన పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడాన్ని ఇష్టపడని శక్తుల ద్వారా ఓ కొత్త సిద్ధాంతం వ్యాప్తిలోకి వచ్చింది. ప్రైవేట్ ఇంగ్లిష్ విద్య చదివిన పిల్లలతో గ్రామీణ విద్యార్థులు పోటీపడకూడదని వీరు భావిస్తున్నారు. వీరు ఒక రాజకీయ పార్టీ లేక ఒక రాజకీయ సిద్ధాంతానికి చెందినవారు కారు. మితవాద పార్టీల సంస్థల నుంచి మీడియా పరిశ్రమాధిపతుల నుంచి, వామపక్ష భావజాలానికి చెందిన విద్యావేత్తల వరకు అన్నిరంగాల్లో ఈ శక్తులు పాతుకుపోయాయి. ఈ కొత్త సిద్ధాంతం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఏమిటా సిద్ధాంతం? ఇంగ్లిష్ చది విన వారందరూ క్రైస్తవులు అయిపోయారట. ఇది షాక్ కలిగించడం లేదూ? ఇది నిజమే అయితే, అమరావతిలో తిష్ట వేసిన సంపన్నులు, బంజారాహిల్స్ బంగ్లాల్లో నివసిస్తున్నవారు, జూబ్లీహిల్స్ భవనాల్లో ఉంటున్నవారు క్రైస్తవులుగా మారిపోయి ఉండాలి మరి. ఇది నిజమే అయినట్లయితే, గ్రేటర్ కైలాస్ ఖాన్ మార్కెట్ (న్యూఢిల్లీ) ప్రాంతంలోని భారతీయ మేధావులు, వాణిజ్యవేత్తలు, మెరీన్ డ్రైవ్ క్వీన్స్ నెక్లెస్ బీచ్ (ముంబై) ఆకాశ హర్మ్యాలలో నివసిస్తున్నవారు, చెన్నైలోని అయ్యర్, అయ్యంగార్లు నివసించే కాలనీలు ఇప్పటికే క్రైస్తవులతో నిండిపోయి ఉండాలి. వీళ్లంతా ఒక చేతిలో బైబిల్, నుదుటి మీద క్రాస్ని కలిగి ఉండాలి మరి. ఇకపోతే ఇంగ్లిష్‌లో వలసవాదాన్ని పసిగడుతున్న మన ఉదారవాద, వామపక్ష కామ్రేడ్లు కూడా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివి ఉండటమే కాకుండా తమ తమ పార్టీల సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశాలను కూడా ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తున్నారు. మరి వీరు కూడా సుత్తి కొడవలికి బదులుగా తమ ఎన్నికల చిహ్నాలుగా క్రాస్‌నే కలిగి ఉండాలి కదా. మనం తినే ఆహారాన్ని పండిస్తున్న, మన నగరాలకు తిండి పెడుతున్న గ్రామీణులకు విద్యలో సమానత్వం అందుబాటులోకి వచ్చినప్పుడు, పట్టణ ప్రాంతాల్లోని సంపన్నులు సౌకర్యవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారో వారు చూడగలిగినప్పుడు ఎలా ఉంటుందో చూడాల్సిందే. భారతీయ విద్యావంతులు క్రైస్తవులుగా మారిపోయారనే విషం చిమ్ముతున్న మితవాద కపటవేషధారులను సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కానీ వామపక్షానికి చెందిన అగ్రకులాలు, వారి అనుయాయులు కూడా సూపర్ మితవాదులుగా వ్యవహరిస్తున్నారు. కారల్ మార్క్స్ వీరిని చూసి జాలిపడి ఉండేవారు, వారి ఉప తెలుగు జాతీయవాదపు అత్యంత చెత్త భావాలను చూసి ఆయన నిజంగానే చింతించేవారు. ఇప్పుడు ఆ మార్క్స్ కూడా వారిని కాపాడలేడు. దేవుడు మాత్రమే వీరిని కాపాడాల్సి ఉంది. మహాత్మాగాంధీ నుంచి జవహర్లాల్, ఇందిరాగాంధీ దాకా, జ్యోతిబసు నుంచి నంబూద్రిపాద్, ఇంద్రజిత్ గుప్తా, సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్, బృందా కారత్ వరకు అందరూ ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే చదువుకున్నారు. వీరు మాత్రమే కాకుండా మతఛాందసవాద పక్షానికి చెందిన లాల్ కృష్ణ అడ్వాణీ నుంచి అరుణ్ శౌరీ, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ నుంచి మోదీ ఆధునిక మార్కెట్ పరిశ్రమలో పనిచేస్తున్న అనేకమంది మేధావులు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారే.. పైగా వీరిలో చాలామంది క్రిస్టియానిటీ వ్యతిరేకులే. మతఛాందసవాద పక్ష హీరో అయిన వీర్ సావర్కర్ పుణేలోని ఫెర్గూసన్ కాలేజీలో అధ్యయనం చేశారు. ఇక్కడే గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్ కూడా చదువుకున్నారు. బాంబే ప్రావి న్స్‌లోని అత్యుత్తమ ఇంగ్లిష్ మీడియం కాలేజీల్లో ఫెర్గూసన్ కాలేజీ ఒకటని గుర్తుంచుకోవాలి. శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లిష్‌ను ప్రధాన భాషగా ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే అత్యుత్తమ ఇంగ్లిష్ కాలేజీల్లో అదొకటి. ఇంగ్లిష్ మీడియం విద్య నిజంగానే హిందూయిజంలోని వ్యక్తులను క్రిస్టియానిటీలోకి మార్చేటట్లయితే, పైన పేర్కొన్న వ్యక్తుల్లో చాలామంది పాస్టర్లు, బిషప్పుల్లా అయి ఉండేవారు. కానీ వీరందరూ ఎవరో మనకు బాగానే తెలుసు. వీరిలో ఇప్పటికే చనిపోయినవారి మృతదేహాలను వారి సమాధులలో శిలువ చిహ్నం ఉంచి పూడ్చిపెట్టలేదు. తగిన హిందూ సంప్రదాయాలతో, వారి పార్థివ దేహాలను దహనం చేశారు. మరి ఏపీలో పైన పేర్కొన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదువుకున్న హిందూ నేతలను అనుసరిస్తున్న ఈ నాయకులంతా ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్ ఇంగ్లిష్ విద్యను చదువుకోలేని పేదపిల్లలు ఇప్పుడు క్రిస్టియన్లుగా మారిపోతారని ఎందుకు భావిస్తున్నారు? వీరు ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌లో చదివినంతమాత్రానే మతం ఎందుకు మారి పోతారో ఈ నేతలే జవాబు చెప్పాలి. ఇలాంటి వాదన ఎక్కడి నుంచి వస్తోంది? సమానత్వం అనే ప్రగాఢమైన భయం నుంచే ఈ వాదనలు పుట్టుకొస్తున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు భయపడితే అర్థం చేసుకోవచ్చు కానీ కమ్యూనిస్టులకు ఎందుకీ భయం? ఈ భయానికి అసలైన కారణం బోధనా మాధ్యమంలో, సిలబస్ కంటెంటులో, విద్యా వాతావరణంలో సమానత్వాన్ని తీసుకురావడమే. విద్యాపరంగా సమానత్వం తీసుకువస్తే.. పేదలు సంపన్నులను సవాలు చేయగలరని, దిగువ కులాలు ఎగువ కులాలను సవాలు చేయగలవని ఇలాంటి వారంతా భయపడిపోతున్నారు. సమానత్వం కోసం పోరాటంలో మానవ చరిత్ర చాలా రక్తం ధారపోసింది. అది దేవుడి ముందు సమానత్వం కోసం పోరాడింది. ఆ యుద్ధంలో సగం విజయాన్ని మాత్రమే సాధించింది. అది భూమిపై సమాన హక్కుల కోసం పోరాడింది. ఈ రంగంలో కూడా మానవ చరిత్ర సగం విజయాన్ని మాత్రమే సాధించింది. భారతదేశంలోనూ భూమి కోసం పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల దాకా అనేకమంది భూ సమస్యపైనే పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ సమానత్వం రాలేదు. ఉదారవాద పెట్టుబడిదారీ విధానం కంప్యూటర్ని, ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొస్తుందని కమ్యూనిస్టు సిద్ధాంతం ఎన్నడూ ఊహించలేదు. కానీ అంతర్జాతీయతత్వాన్ని విశ్వసించే వామపక్షవాదులు ఇంతగా ఎలా పతనమయ్యారు? మన దేశ వామపక్షాలు సృజనాత్మకతను మొత్తంగా కోల్పోయి సులభంగా ఆకర్షించే కపటత్వంలోకి ఎలా వెళ్లిపోయాయి? రక్తాన్ని చిందించడం ద్వారా కంప్యూటర్, ఇంటర్నెట్ విప్లవాలను ఎవరూ తీసుకురాలేదు. మంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచే వీటిని సాధించారు. ప్రత్యేకించి తెలుగు, తమిళం, హిందీ ద్వారా కాకుండా ఇంగ్లిష్ భాషలో విద్య ద్వారానే ఈ విప్లవాలను తీసుకొచ్చారు. ఏ భాష అయినా కొత్త విషయాలను కనిపెట్టే శక్తిసామర్థ్యాలను కలిగి ఉండాలి. హిందుత్వ శక్తులు నూతన విప్లవాల చరిత్రను అర్థం చేసుకుంటారని ఎవరూ ఊహించరు కానీ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే సూత్రాన్ని విశ్వసించే కమ్యూనిస్టులు చరిత్రను అర్థం చేసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ కార్మికుల మధ్య భావ వ్యక్తీకరణ సాధనంగా ఒక ఉమ్మడి ప్రపంచ భాష లేకుండా వారు కార్మికులను ఎలా ఐక్యపర్చగలరు? బోధనా మాధ్యమం, సిలబస్ కంటెంట్, పాఠశాల మౌలిక వసతి వంటి అంశాలపరంగా విద్యాపరమైన సమానత్వం గురించి ఇతర రాజకీయనేతలు ఆలోచించకముందే కమ్యూనిస్టులు దానిగురించి ఆలోచించి ఉండాలి. కానీ కమ్యూనిస్టులు సరిగ్గా దానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. రెండు విభిన్న మాధ్యమాల ఉనికి గురించి ప్రశ్నించకుండానే వారు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేర్పించారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కార్మిక వర్గం, దిగువ కులాలు, పేద తరగతులకు చెందిన పిల్లలను ప్రాంతీయ భాషలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధంగా చేర్పించారు. ఇదే రకమైన పాఠశాల విద్యా వ్యవస్థతో వారు పశ్చిమబెంగాల్‌ను ధ్వంసం చేశారు. ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో ఇంగ్లిష్ విద్య ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, పాఠశాలకు పిల్లలను పంపిన ప్రతి తల్లి ఖాతాకు అమ్మ ఒడి పేరుతో రూ. 15,000 అందించడం అనేవి రక్తరహిత విప్లవాన్ని తీసుకొస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఉంటున్న యువత ఇంగ్లిష్ విద్యా పరిరక్షణ దళాలను నిర్వహించాలి. తమ పిల్ల లకు ఇంగ్లిష్ విద్యను వ్యతిరేకిస్తున్న వారిపై పోరాడేందుకు తల్లులందరూ అమ్మ హక్కుల బృందాలను ఏర్పర్చాలి. గ్రామాల్లోని మన ఇళ్ల ముందుకు వచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని కోల్పోవడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ప్రొ.కంచ ఐలయ్య వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
బాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒక్క సీటూ రాదు : కంచె ఐలయ్య
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటూ రాదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య బుధవారం వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. దేశంలో ఇంతవరకు ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకున్నందుకు జగన్‌కు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్తే మారుతుందని, ఇంగ్లీష్‌లో చదవడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టమని అడిగితే ఒప్పుకోలేదని వెల్లడించారు. అమ్మ ఒడి వల్ల పేదల బతుకులు మారుతాయని, దీన్ని వ్యతిరేకిస్తున్నవారిని చీపుర్లతో తరిమికొట్టాలని తల్లులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియంను కార్పొరేట్ శక్తులే వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ‘అన్ని పార్టీల నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. మా పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌లో చదవకూడదా? లేక పేదపిల్లలు పెద్దల పిల్లలకు పోటీగా వస్తారని భయపడుతున్నారా’? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ వల్ల తెలుగు భాషకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, ఇప్పుడు మొత్తుకుంటున్న మేధావులు ప్రైవేట్ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టమని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏమి తెలుసని ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని హెచ్చరించారు. అమ్మ ఒడి పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల పిల్లల జీవితాలు బాగుపడడం చంద్రబాబు, పవన్‌లకు ఇష్టం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. పేదల బతుకులు మారాలని ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని కుహనా మేధావులే వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా..’
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదని బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొవడం లేదని తెలిపారు. ఇది పోలీసుల చేతకాని తనమేనని మండిపడ్డారు. ఒక ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా చేశారన్నారు. గోశామహల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందన్నారు. దేశంలో మొదటిసారి ఒక హిజ్రా ఎన్నికల్లో పోటీ చేయబోతోందని, ఆమెను కిడ్నాప్ చేయడం దురదృష్టకరమని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే చంద్రముఖి ఆచూకీ లభించడం లేదన్నారు. ఈ ఘటనపై ఏ రాజకీయ పార్టీ నుండి కనీసం స్పందన లేదని మండిపడ్డారు. చంద్రముఖి సమస్యపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖి విషయంలో టీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేశామని, చాలా ప్రజా సంఘాలు ఈ కేసులో ఇంప్లిడ్ అవుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య అభివృద్ధికి చంద్రముఖి ప్రతీక అని కొనియాడారు. ఒక ట్రాన్స్ జెండర్ కిడ్నాప్ జరిగితే ఎవరు స్పందించకపోవడం బాధాకరమని ట్రాన్స్ జెండర్ ప్రతినిధి లైలా అన్నారు. చంద్రముఖి చాలా ప్రోగ్రెసివ్ వ్యక్తి అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు. చంద్రముఖి పిరికి వ్యక్తి కాదని, ఖచ్చితంగా కిడ్నాప్ కి గురైందని తెలిపారు. చంద్రముఖి దొరికే వరకు గోశామహల్లో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని నిప్పులు చెరిగారు. మంగళవారం ఉదయం నుండి చంద్రముఖి కనపడడం లేదని, పౌర హక్కుల కోసం పోరాడే చంద్రముఖి కిడ్నాప్ కావడం దారుణమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ కిడ్నాప్‌కు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖికి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారన్నారు. చంద్రముఖి బయపడి పారిపోయే వ్యక్తి కాదు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. -
కంచ ఐలయ్యపై చర్యలేవి: ఎమ్మెల్యే ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: ఆర్య వైశ్యులను స్మగ్లర్లు అని అభివర్ణిస్తూ పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ప్రశ్నించారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినా, రాతలు రాసినా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని ప్రభాకర్ కోరారు. -
‘సంఘీభావ సభ’పై కౌంటర్ వేయండి
సాక్షి, హైదరాబాద్: విజయవాడ, జిం ఖానా మైదానంలో శనివారం ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సం ఘీభావంగా నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యానికి సం బంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దా ఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమ వారం ఏపీ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28న కంచ ఐలయ్యకు సంఘీభావంగా తలపెట్టిన కార్యక్రమానికి అనుమతిని ఇవ్వకుండా పోలీసులను ఆదేశించాలంటూ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కె.విద్యాధరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి విచారించారు. -
ఆ ఒప్పందంతో నాకు సంబంధం లేదు
హైదరాబాద్: సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర బహుజన నాయకులు, ఆర్య వైశ్య నాయకుల మధ్య విజయవాడలో జరిగిన ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఆదివారం ఇక్కడ టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐలయ్య మాట్లాడుతూ ‘సామాజిక స్మగ్లర్లు– కోమటోళ్లు’పుస్తకం టైటిల్ మారుస్తానని, అభ్యంతరకర విషయాలను తొలగిస్తానని, పుస్తకం రాసినందుకు క్షమాపణ చెబుతానని, భవిష్యత్తులో కులం గురించి విమర్శలు చేయబోనని ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఈ పుస్తకంపై అక్టోబర్ 13న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎటువంటి చర్చకు ఆస్కారంలేదని అన్నారు. ఈ నెల 28న విజయవాడలో తలపెట్టిన కంచ ఐలయ్య సంఘీభావ, సామాజిక జేఏసీ సభకు వస్తున్నవారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభకు అనుమతి ఇవ్వకపోవటం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవటమేనని విమర్శించారు. సామాజికవేత్త ఉ.సాంబశివరావు మాట్లాడుతూ విజయవాడలో జరిగిన ఒప్పందానికి కంచ ఐలయ్య సంఘీభావ, సామాజిక జేఏసీకి ఎలాంటి సంబంధం లేదని, వారు చేసుకున్న ఒప్పందంలో జేఏసీ నాయకులు ఎవరూ లేరని అన్నారు. టీ మాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ కంచ ఐలయ్యకు సంఘీభావంగా తలపెట్టిన సభకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకుండా గృహనిర్బంధం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఐలయ్య పుస్తకంపై మరోసారి సుప్రీంకు సాక్షి, న్యూఢిల్లీ: ఆర్యవైశ్యులను కించపరిచేలా ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ సంఘం నేతలు వెల్లడించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా పుస్తకాన్ని రచించిన ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ఆదివారం ధర్నా చేపట్టారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాయడం భావప్రకటన కిందకు రాదని, ఈ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలన్నారు. -
టీజీ వెంకటేశ్ సవాల్
సాక్షి, కర్నూలు (టౌన్): ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సవాల్ విసిరారు. తమ సామాజిక వర్గాన్ని పదే పదే దూషిస్తే తిరగబడతామని కంచ ఐలయ్యను హెచ్చరించారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలోని బనియా సంపన్నులతో ఆర్యవైశ్యులను పోల్చడం ఎంత వరకు సమంజసమన్నారు. ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పుస్తకంపై సుప్రీం కోర్టు కేసును డిస్మిస్ చేయలేదని, కేవలం డిస్పోజ్ చేసిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కేసు త్వరలోనే పరిశీలనకు వస్తుందని వెంకటేశ్ తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్న ఐలయ్య వెనుకబడిన వర్గాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశానికి వత్తాసు పలికే ఐలయ్యకు కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించడం బాగానే ఉందని, వారిలోనూ మార్పు తీసుకొచ్చినందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. -
కంచ ఐలయ్యను అరెస్ట్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అంటూ వైశ్యులను కించపరిచేలా పుస్తకం రాసిన కంచ ఐలయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మహాసభ ప్రతినిధులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మలను కలసి ఫిర్యాదు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తూ హిందూ కులాలపై కక్ష్య సాధింపునకు ఐలయ్య పాల్పడుతున్నారని ప్రతినిధులు ఆరోపించారు. ఐలయ్య వెనకున్న విదేశీ సంస్థల గుట్టు విప్పాలని, వెంటనే కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హోంమంత్రి, డీజీపీలను కోరామని మహాసభ అధ్యక్షుడు కాశెట్టి పాండు గుప్తా, మహిళా విభాగం అధ్యక్షురాలు జూలూరి స్వరూపరాణి తెలిపారు. -
ఐలయ్యపై దాడి పిరికిపందల చర్య: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఓబీసీ, దళిత హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక వేత్త, రచయిత, ఫ్రోఫెసర్ కంచె ఐలయ్యను దూషిస్తూ జరగుతున్న దాడిని పిరికిపందల చర్యగా భావిస్తున్నామని ఏఐసీసీ సమాచార వ్యవహారాల ఇంచార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్చఉందన్నారు. మేధావుల గొంతు నొక్కి తార్కిక వాదుల ఆలోచనలపై నిరంతరం జరుగుతున్న దాడులు దారుణమన్నారు. సెప్టెంబర్ 24న పరకాలలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఫ్రోఫెసర్ కంచె ఐలయ్య వాహనంపై రాళ్లు చెప్పులతో దాడి చేయించడం, బీజేపీ అంటకాగుతున్న టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ నిస్సిగ్గుగా ఐలయ్యని చంపమని, వీలైతే బహిరంగంగా వీధుల్లో ఉరితీసినా తప్పులేదని ఫత్వా జారీ చేయాడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ ప్రవర్తన పట్ల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. -
టీఆర్ఎస్కు శివసేన లక్షణాలు
ఓవైపు ప్రజలు చనిపోతుంటే యాగాలా: ప్రొ. కంచె ఐలయ్య సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు పూర్తిగా శివసేన పార్టీ లక్షణాలున్నాయని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తెలంగాణ శివసేన అని గతంలోనే తాను రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవైపు ప్రజలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ ఆయత మహా చండీయాగాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. 16వ శతాబ్దంలో రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించగా.. 21వ శతాబ్దంలో సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూడలిజం బురదలో పడిందని, దాన్నుంచి బయటకు తీసుకురావాలన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఐలయ్య రచించిన ‘ఫ్యూడలిజం మల్లొచ్చింది’ వ్యాస సంపుటిని దళిత విద్యార్థిని కుమారి కన్నం ప్రజ్వలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ‘‘సర్దార్ వల్లభాయ్‌పటేల్ తొలి ప్రధాని అయితే దేశం ఇలా ఉండేది కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. కానీ పటేల్ ఆ పదవిలో ఉండి ఉంటే అంబేడ్కర్‌ను రాజ్యాంగాన్ని రాయనిచ్చే వారు కాదు. బీజేపీ సంపుడు పార్టీ’’ అని అన్నారు. రకరకాల ముసుగులు వేసుకుని పాలకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని దుర్మార్గంగా అణిచివే స్తున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. -
సామాజిక చిత్రం
గోద్రా రైలు దుర్ఘటన జరిగి పదమూడేళ్లు. కానీ నాటి గాయాలు నేటికీ మానలేదు. ఇలాంటి సంఘటనలకు మూలం మత విద్వేషాలు. ఈ క్రమంలో మతసామరస్యంపై ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం ప్రారంభమైన ‘కమ్యూనల్ హార్మోనీ ఫిల్మ్ ఫెస్టివల్’. విబ్జియార్ సహకారంతో విమోచన్, లామకాన్‌లు... గుజరాత్‌లోని గోద్రా అల్లర్లపై శుబ్రదీప్ చౌదరికి ట్రిబ్యూన్‌గా ఈ రెండు రోజుల ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ... మత విద్వేషాలకు కారణం కుల వ్యవస్థని, ఐదు వేల ఏళ్లుగా దళితులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. దేశంలో నిమ్నకులస్థులు, ఆదివాసీలపై చిత్రాలు తీయాలన్నారు. తొలిరోజు ‘గోద్రా తక్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ డాక్యుమెంటరీ చిత్రాలు ప్రదర్శించారు. గోద్రా రైల్వే స్టేషన్లో రైలు ఆగడం... క్షణాల్లో చెలరేగిన మంటలు... ఆ చిచ్చుకు శవాలుగా మారిన అమాయకులు... దేశాన్ని అట్టుడికించిన ఈ సంఘటన వాస్తవ రూపాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తేవాలన్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఈ పరిశోధనాత్మక డాక్యుమెంటరీ రూపొందించారు శుబ్రదీప్. ఈయన బ్రెయిన్ హ్యామరేజ్‌తో మరణించారు. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్... అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాల క్రమంలో రేగిన చిచ్చు, అల్లర్లపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. ఆనంద్ పట్వర్దన్ తీసిన ఈ డాక్యుమెంటరీ... అప్పటి రాజకీయ, సామాజిక, కులమత విద్వేషాలను కళ్లకు కట్టింది. ఈ ఆందోళనల వల్ల అగ్రకులాల వారు, రాజకీయ నాయకులు తప్ప మిగిలిన వారంతా నష్టపోతారని ఓ రైతు ముందే చెప్పడం గమనిస్తే... ఇందులో కుట్ర ఉందని అర్థం చేసుకున్నట్టేనన్నది దర్శకుడి అభిప్రాయం.