
సాక్షి, హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అంటూ వైశ్యులను కించపరిచేలా పుస్తకం రాసిన కంచ ఐలయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మహాసభ ప్రతినిధులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మలను కలసి ఫిర్యాదు చేశారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తూ హిందూ కులాలపై కక్ష్య సాధింపునకు ఐలయ్య పాల్పడుతున్నారని ప్రతినిధులు ఆరోపించారు. ఐలయ్య వెనకున్న విదేశీ సంస్థల గుట్టు విప్పాలని, వెంటనే కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హోంమంత్రి, డీజీపీలను కోరామని మహాసభ అధ్యక్షుడు కాశెట్టి పాండు గుప్తా, మహిళా విభాగం అధ్యక్షురాలు జూలూరి స్వరూపరాణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment