సాక్షి, హైదరాబాద్: ఓబీసీ, దళిత హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక వేత్త, రచయిత, ఫ్రోఫెసర్ కంచె ఐలయ్యను దూషిస్తూ జరగుతున్న దాడిని పిరికిపందల చర్యగా భావిస్తున్నామని ఏఐసీసీ సమాచార వ్యవహారాల ఇంచార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్చఉందన్నారు. మేధావుల గొంతు నొక్కి తార్కిక వాదుల ఆలోచనలపై నిరంతరం జరుగుతున్న దాడులు దారుణమన్నారు.
సెప్టెంబర్ 24న పరకాలలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఫ్రోఫెసర్ కంచె ఐలయ్య వాహనంపై రాళ్లు చెప్పులతో దాడి చేయించడం, బీజేపీ అంటకాగుతున్న టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ నిస్సిగ్గుగా ఐలయ్యని చంపమని, వీలైతే బహిరంగంగా వీధుల్లో ఉరితీసినా తప్పులేదని ఫత్వా జారీ చేయాడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ ప్రవర్తన పట్ల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.