బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు
గురుకులాలు అన్ని సౌకర్యా లతో శాశ్వత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను గుర్తించామని, విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. గతంలో హాస్టల్ విద్యార్థులకు నెలకు 4 సార్లు మాంసాహారాన్ని అందించగా, ప్రస్తుతం 7 సార్లు ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. బీసీ విదేశీ విద్యా నిధి పథకం కింద త్వరలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుందని, అధికారులు సకాలంలో నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్, అదనపు కార్యదర్శి సైదా, కమిషనర్ అరుణ, జేడీలు అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు తదితరులు పాల్గొన్నారు.