సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం మెట్టు దిగింది. గ్రేటర్‌లో శివారు పంచాయతీల విలీనంపై వెనక్కి తగ్గింది. విలీనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన 14 పంచాయతీలకు ఎన్నికల నగారా మోగించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21న పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. నగరీకరణ నేపథ్యంలో రాజధాని పరిసరాల్లోని 36 పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో కలపాలని ప్రభుత్వం తొలుత ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకునేంతవరకు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం మార్కెట్ ధరనే భరించాల్సి ఉంటుంది.
బ్యాంక్ సీడింగ్‌లో వెనుకబాటు
గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేయడంలో పూర్తిగా వెనకబడిపోయింది. ఎల్పీజీ గ్యాస్ డీలర్లు సుమారు 67.5 శాతం కనె క్షన్ల వరకు ఆధార్‌తో అనుసంధానం చేయడంలో సఫలికృతం కాగా, బ్యాంక్ ఖాతాల అనుసంధానం మాత్రం 41.5 శాతం మించలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ, రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలోని స్లమ్ ఏరియాలు బ్యాంక్‌సీడింగ్‌లో పూర్తిగా వెనకబడినట్లు కనిపిస్తోంది. బ్యాంకర్లు కొత్త ఖాతాల ప్రారంభానికి జీరో డిపాజిట్‌కు వెసులుబాటు కల్పించి ఆదివారం సైతం పనివేళలు కొనసాగించినా.. ఫలితం లేకుండా పోయింది.
చివరకు మొబైల్ వాహనాల ద్వారా అవగాహన కూడా కల్పించారు. ఆయినప్పటికీ అనుసంధానంలో మాత్రం గ్యాస్ డీలర్లతో సమానంగా ముందుకు సాగలేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ ఎల్పీజీ కనెక్షన్‌గల సంపన్న కుటుంబాలతో పాటు గల్ఫ్ ఇతర దేశాలకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు సైతం తమ బ్యాంక్ ఖాతాలను ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ముందుకు రాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఇతర పేర్లపై ఎల్పీజీ కనెక్షన్లు గల వినియోగదారులకు ఆధార్‌కార్డులున్నా అనుసంధానానికి దూరంగా ఉండిపోయారు.
స్కూళ్ల ద్వారా కూడా వివరాలు సేకరించాం
ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానం కోసం స్కూళ్ల విద్యార్థుల ద్వారా కూడా వివరాలు సేకరించాం. వాటిని అనుసంధానం చేస్తున్నాం. ఫలితంగా ఆధార్ అనుసంధానం మరికొంత పెరిగే అవకాశం ఉంది.
- డాక్టర్ పద్మ, సీఆర్‌వో, హైదరాబాద్
ఇప్పటికైనా అనుసంధానం చేసుకొండి
ఇప్పటికైన ఎల్పీజీ వినియోగదారులు తమ కనెక్షన్లను ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీకి దూరమవుతారు. రాయితీ లేకుండా మార్కెట్ ధర ప్రకారం గ్యాస్ రీఫిల్లింగ్‌కు నగదు చెల్లించాల్సి ఉంటుంది. - అశోక్,
గ్రేటర్ వంట గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షుడు
‘శివారు’లో ఎన్నికల నగారా
Published Tue, Sep 3 2013 12:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement